TCS Company Americans are worried that they will take our jobs
TCS Company: అమెరికన్ ఉద్యోగులు ప్రముఖ ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టీసీఎస్ కంపెనీ తమను ఉద్యోగం నుంచి అనైతికంగా తొలగించి ఇండియన్స్‌ను వర్క్‌లో తీసుకుంటున్నారని ఆరోపించింది. కంపెనీ ఖర్చు తగ్గించుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఇది అమెరికాా చట్టాలకు వ్యతిరేకం అని ఆరోపించారు. తమ స్థానంలో ఇండియా నుంచి టెకీలను నియమించుకుంటోందని విమర్శించారు. హెచ్ 1 బి వీసా ద్వారా తాత్కాలికంగా నియామకాలు చేపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికన్స్‌తో పోలిస్తే ఇండియా నుంచి వచ్చే ఉద్యోగులు తక్కువ వేతనానికే పనిచేస్తారని, అదే ఆశతో టీసీఎస్ కంపెనీ అనైతిక చర్యకు పాల్పడుతుంని వారు మండిపడ్డారు. తమను ఉద్యోగం నుంచి తొలగించినట్లు షార్ట్ నోటీసు ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఈక్వల్ ఎంప్లాయ్ మెంట్ ఆపర్చునిటీ కమిషన్ (ఈఈఓసీ) వద్ద కంపెనీపై ఫిర్యాదు చేశారు. టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులను, ఉన్నత విద్యావంతులను ఇంటికి పంపిందని ఆరోపించారు. ఇండియా నుంచి ఉద్యోగులను పిలిపించడంతో పాటు అమెరికాలో ఉంటున్న హెచ్ 1 బి వీసా హోల్డర్లనూ ఈ కంపెనీ నియమించుకుంటోందని చెప్పారు. వీరి ఆరోపణలకు టీసీఎస్ స్పందించింది. తమ కంపెనీ ఎప్పుడు అనైతిక చర్యలకు పాల్పడదని, కంపెనీ చరిత్ర ఉందని, అందరికి సమాన అవకాశాలు ఇస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.