»Chidambaram Said People Of All Sections Are Unhappy In Telangana
Chidambaram: తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు
తెలంగాణలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) తాజాగా పేర్కొన్నారు. దీంతోపాటు హైదరాబాద్లోనే గ్యాస్ ధర అత్యధికంగా ఉన్నట్లు గుర్తు చేశారు. మరోవైపు రాష్ట్రంలో అప్పులు కూడా స్థాయికి మంచి పెరిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై నిరాశతో ఉన్నట్లు చెప్పారు.
Chidambaram To Head Congress Manifesto Committee For 2024 Polls
తెలంగాణలో కాంగ్రెస్ తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం(Chidambaram) గురువారం అన్నారు. అంతేకాదు ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుంచి పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో గ్యాస్ ధర హైదరాబాద్లోనే అత్యధికంగా ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఇంకా 80 వేల ఉద్యోగాలు(jobs) ఖాళీగా ఉన్నాయని..వాటిని భర్తీ చేయడంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఈ క్రమంలోనే నిరుద్యోగం రికార్డు స్థాయిలో పెరిగినట్లు వెల్లడించారు. దేశ సగటు కంటే ఇక్కడే నిరుద్యోగ రేటు(unemployment rate) ఎక్కువగా ఉందన్నారు. ఒక్క విద్యార్థులు మాత్రమే కాదు..రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చిదంబరం తెలిపారు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా భారీగా పెరిగిపోయినట్లు గుర్తు చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని చిదంబర్ పేర్కొన్నారు. ఇవి అమలు కావడం ద్వారా తెలంగాణలో మార్పు మొదలవుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని అన్నారు. కేసీఆర్(KCR) ప్రతిపక్షాలు, మోడీపై ఆరోపణలు చేస్తు ప్రచారం చేస్తున్నారు. తప్ప రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి మాత్రం ప్రస్తావించడం లేదన్నారు. అంతేకాదు డబుల్ బెడ్ రూం, కాళేశ్వరం ప్రాజెక్టు సహా అనేక కంట్రాక్టులలో కేసీఆర్ ప్రభుత్వం కమిషన్లు తీసుకుని ప్రజల సొమ్మును భారీగా దొచుకున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో యువత, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలు బుద్ది చెప్పాలని చిదంబరం ప్రజలను కోరారు.