»Mlc Kavitha Who Danced With Activists Video Viral
MLC Kavitha: కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేసిన ఎమ్మెల్సీ కవిత..వీడియో వైరల్
బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ (Telangana)లో ఎన్నికల ప్రచారాలు (Elections campaigns) జోరందుకున్నాయి. పోలింగ్ తేది దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS)లో అటు సీఎం కేసీఆర్ (CM KCR), ఇటు కేటీఆర్ (KTR) ప్రచారాలను ముమ్మరం చేశారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత కూడా ప్రచారం కార్యక్రమాల్లో పాల్లొంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తమ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Video Viral) అవుతోంది.
బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ వేస్తున్న ఎమ్మెల్సీ కవిత వీడియో:
గులాబీల జెండలే రామక్క..అనే పాటకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డ్యాన్స్ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కవిత బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మంత్రి నిరంజన్ రెడ్డికి మద్దతుగా పర్యటించారు. సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఆమె గులాబీ జెండలమ్మ పాటకు మాస్ స్టెప్పులేశారు. పాటకు తగ్గట్లుగా అడుగులు వేస్తూ కవిత కార్యకర్తలతో ఆడిపాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా బీఆర్ఎస్ శ్రేణులంతా తగ్గేదేలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బాల్కొండ (Balkonda) ఎన్నికల ప్రచారంలో పాల్గొన ఎమ్మెల్సీ కవిత తమ ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP)లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు కేవలం ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాయని, బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల కోసం, వారి బతుకులు బాగుపడటం కోసం గెలవాలనుకుంటోందని అన్నారు. బాల్కొండను బంగారు కొండలా అభివృద్ధి చేసిన మంత్రి ప్రశాంత్ రెడ్డిని మళ్లీ గెలిపించి బీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఎమ్మెల్సీ కవిత కోరారు.