ATP: తాడిపత్రిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఇటీవల జరిగిన ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఏఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు.