నేటి నుంచి 20వ తేది వరకూ హైదరాబాద్ నగరంపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసింది. మంత్రి కేటీఆర్ రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మహానగరంలోని 11 నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు సాగనున్నాయి.
తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) హైదరాబాద్‌లో పలు రోడ్ షో (Road Show)లను నిర్వహించనున్నారు. మొన్నటి వరకూ పలు జిల్లాల్లో పర్యటిస్తూ వచ్చిన ఆయన ఇక హైదరాబాద్ (Hyderabad)పై ఫోకస్ చేశారు. మహానగరంలో ఓటర్లను ఆకర్షించేందుకు పలు హామీలను ఇవ్వనున్నారు. గ్రేటర్ నగరంపై పట్టు కొనసాగించేందుకు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
నగరంలోని పలు నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలు (KTR Road show) ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో మరింత జోష్ పెరిగింది. నేటి నుంచి ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ ఈ రోడ్ షోలు ఉంటాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ రోడ్ షోలలో పాల్గొననున్నారు.
నవంబర్ 20వ తేది వరకూ కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి. గ్రేటర్ హైదరాబాద్ లోని 11 నియోజకవర్గాల్లో కేటీఆర్ రోడ్ షోలకు ప్రణాళిక రెడీ అయ్యింది. నేడు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్‌లో రోడ్ షో ఉంటుంది. అలాగే రేపు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌లో ప్రచారం సాగనుంది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్ లల్లో కేటీఆర్ ప్రచారం చేపడుతారు. అలాగే 19వ తేదిన అంబర్ పేట, ముషీరాబాద్, 20వ తేదిన ఉప్పల్, ఎల్బీ నగర్ లల్లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు.