తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ తరుణంలో అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో మునిగిపోయారు. బీఆర్ఎస్ (BRS)తో పోటీగా బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీలు (Congress Party) ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. తమ పార్టీలోని సీనియర్ నాయకులతో సమావేశాలు జరుపుతుంటే మరో వైపు అసంతృప్తిలో ఉన్న నేతలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈసారి బీజేపీ (BJP) తెలంగాణలో అధికారంలోకి రావాలని తెగ ప్రయత్నిస్తోంది.
అయితే ఇప్పటికే కొందరు నేతలు బీజేపీ (BJP)ని వీడి ఇతర పార్టీల కండువాలను కప్పుకున్నారు. తాజాగా బీజేపీ పార్టీ మహిళా నేత విజయశాంతి (Vijayashanti) కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గతకొంత కాలంగా ఆమె పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీ ()లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది.