అప్పటి సినిమాలే అలా ఈ రోజున సంచలనం క్రియేట్ చేస్తుంటే, మరి అప్పటి కాంబినేషన్లు ఎంత దుమారం లేపుతాయో చెప్పనవసరం లేదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, యువరత్న బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోందా లేదా అనే చర్చ పెద్ద స్థాయిలోనే జరుగుతోంది చిత్రపరిశ్రమలో
ఇప్పుడంతా రెట్రో ట్రెండ్ నడుస్తోంది. పాతసినిమాలు రీరిలీజ్‌లు అవుతున్నాయి. వాటి మీద కూడా సొమ్ము చేసుకోగలుగుతున్నారు. జనం కూడా బాగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్యనొచ్చిన ఆరెంజ్ సినిమా మొదట రిలీజైనప్పుడు పెద్ద టాక్ లేదు. దాదాపుగా డిజప్పాయంట్ చేసిన్టట్టే అయింది. కానీ సెకండ్ రిలీజ్లో దుమ్ము లేపేసింది. మొన్నీ మధ్యన మే తొమ్మిదిన విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి ప్రపంచాన్నే ఉర్రూతలూగించింది. అప్పటి సినిమాలే అలా ఈ రోజున సంచలనం క్రియేట్ చేస్తుంటే, మరి అప్పటి కాంబినేషన్లు ఎంత దుమారం లేపుతాయో చెప్పనవసరం లేదు. ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, యువరత్న బాలకృష్ణ, లేడీ అమితాబ్ విజయశాంతి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోందని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న నేపథ్యంలో నిజంగా ఆ కాంబినేషన్ రిపీట్ అవుతోందా లేదా అనే చర్చ పెద్ద స్థాయిలోనే జరుగుతోంది చిత్రపరిశ్రమలో.
ఇదెక్కడ పుట్టిందంటే భారీ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ సెకండ్ పార్ట్ లో లేడీ అమితాబ్ యువరత్న కాంబో రాబోతోందనే ఊహాగానాలు మిన్ను ముడుతున్నాయి. కాకపోతే వీటికి సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం ఎక్కడా బైటకు రాలేదు. బోయపాటి కాంప్ నుంచి గానీ, లేడీ అమితాబ్ సన్నిహితుల నుంచి గానీ ఏ విధమైన సమాచారం అందలేదు.
కానీ, ఈ వార్తకి ఇప్పుడు అంత ఊపు రావడానికి కారణం మాత్రం బలంగానే కనిపిస్తోంది. అదేంటంటే, లేడీ అమితాబ్ విజయశాంతి ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. ఇటీవలే విడుదలైన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ ఐపిఎస్ చిత్రంలో ఆమె చేసిన ఫైట్స్ అండ్ ఎమోషనల్ పెరఫారమెన్స్ చిత్రపరిశ్రమని ఒక్క కుదుపు కుదిపాయి. ఇప్పటికీ ఆమె విగర్, పవర్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. పైగా అప్పటివరకూ సినిమా బిజినెస్ నత్త నడక నడుస్తుంటే ట్రైలర్ రిలీజ్ కాగానే వెంటనే ఏరియాలన్నీ వెంటవెంటనే అమ్ముడయిపోయి, సినిమా రిలీజ్ ముందు నిర్మాతలు సేఫ్ జోన్లోకి వెళ్ళపోగలిగారు. ఇది కేవలం లేడీ అమితాబ్ ఎఫెక్టేనని అందరూ నమ్మే పరిస్థితి ఎదురైంది.
కాబటి, ఆమె సినిమాల బిజినెస్ పరంగా కూడా ఏ పెద్ద కాంబినేషన్కైనా కూడా ఎడ్వాంటేజే తప్పితే మరొక రకమైన ఇబ్బంది కనిపించడం లేదు. ఇది గాక, నైజాం వరకూ ఆమెకున్న రాములక్క పాప్యులారిటీ ఎవర్‌గ్రీన్‌గా నిలబడిపోయింది. అది ఆమెకు రాజకీయంగా కూడా కంచుకవచంలాగానే కాపాడుతోంది. ఆమెకున్న మాస్ పాప్యులారిటీ, ఆమె మెంటైన చేస్తున్న సూపర్ ఫిట్‌నెస్‌కు దోహదపడుతున్న ముఖ్యవిషయాలు. .సో…కొందరంటున్న మాటేంటంటే బోయపాటి లేడీ అమితాబ్న తన సినిమాలో పెట్టుకోవడానికి మొగ్గు చూపండంలో తప్పేం లేదు, ఇది కలిసొచ్చే పాయంటే గానీ, మైనస్ కాదు అని. వీటితో పాటు, బాలకృష్ణ విజయశాంతి కాంబినేషన్లో వచ్చినన్ని హిట్లు బాలకృష్ణకి మరొక హీరోయిన్‌తో రాలేదన్నది హిష్టరీ. ఏ విషయం త్వరలోనే తెలుస్తుందన్నది ప్రస్తతానికి భోగట్టా.