»Pm Modi This Time After Coming To Power Will Make It The Third Largest Economy
PM Modi: ఈసారి అధికారంలోకి వచ్చాక.. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా!
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ హామీ ఇఛ్చారు.
PM Modi: స్టార్టప్ కంపెనీలు దేశాభివృద్ధిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఢిల్లీలోని భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని మోదీ హామీ ఇచ్చారు. 1.25 లక్షల స్టార్టప్‌లు, 110 యూనికార్న్‌లతో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది.
కచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు రోడ్‌మ్యాప్ రూపొందించామని మోదీ అన్నారు. కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు పెట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగాల కోసం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారని మోదీ అన్నారు. దేశంలో 45 శాతం స్టార్టప్‌లను నడిపిస్తుంది మహిళలే అని మోదీ తెలిపారు. మధ్యంతర బడ్జెట్లో పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోటి బడ్జెట్ కేటాయించడం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని మోదీ తెలిపారు.