»Trump And Biden To Contest In Us President Elections
US polls : జో బైడెన్, ట్రంప్.. దాదాపుగా ఖరారైన అభ్యర్థిత్వాలు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ, డెమాక్రాటిక్ పార్టీల తరఫు నుంచి అభ్యర్థిత్వాలు దాదాపుగా ఖరారయ్యాయి. డొనాల్డ్ ట్రంప్, బైడెన్లు వచ్చే ఎన్నికల్లో తలపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Joe Biden and Donald Trump are competing in the US presidential race
America polls : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ల అధ్యక్ష అభ్యర్థిత్వాలు దాదాపుగా ఖరారయ్యాయి. ఫోరిడా, ఓహయ్యోల్లో జరిగిన ప్రైమరీల్లో వీరిద్దరూ అదనపు డెలిగేట్లను దక్కించుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ల అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారు అయినట్లు కనిపిస్తోంది. వీరిద్దరూ వచ్చే నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Presidential elections ) కోసం పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖరారైన ట్రంప్‌పై(Trump) ప్రస్తుతం పలు కోర్టుల్లో చాలా న్యాయపరమైన కేసులు నడుస్తున్నాయి. వీటిని ఎదుర్కొంటూనే మరో పక్క ఆయన ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. 2020 ఎన్నికలను రద్దు చేయడానికి ట్రంప్ కుట్ర పన్నారనే అంశంపైనా ఆయనపై కేసు నడుస్తోంది. దీన్ని కొట్టివేయాలంటే ఆయన సుప్రీం కోర్టును కోరారు. అయితే అత్యున్నత న్యాయస్థానం దీనిపై ఇంకా విచారణ జరపలేదు.
మరోవైపు డెమాక్రాటిక్ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న జో బైడెన్(Biden) వయసు, జ్ఞాపక శక్తి తదితర విషయాలపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన పలు దేశాల అగ్ర నేతలతో మాట్లాడేప్పుడు తడబాటుకు గురికావడం, పేర్లు గుర్తు తెచ్చుకోలేకపోవడం లాంటి వాటి మీదా అమెరికన్లు, ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్యా పోరు ఎలా ఉంటుందో వచ్చే నవంబరు నాటికి తెలిసిపోతుంది.