Electric Cars: వేసవిలో ఈవీ కార్లు మంచి కంటిషన్లో ఉండాలంటే.. ఇలా చేయాల్సిందే!
ఈ మధ్య ఎలక్ట్రానిక్ కార్ల వాడకం అంతకంతకూ పెరుగుతోంది. అయితే వేసవి కాలంలో వీటిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై అవగాహనతో ఉండటం అత్యవసరం. అందుకే ఇది చదివేయండి.
Electric Car Maintenance Tips : మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఈవీ కార్ల వాడకం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. చాలా మంది ఎక్కువగా వీటిని కొనుక్కుని వాడుతున్నారు. అయితే వేసవి కాలంలో వీటి కండిషన్ సరిగ్గా ఉండాలంటే కచ్చితంగా మెయింటనెన్స్(Maintenance) విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ఈవీ కార్ల ఓనర్లు, వీటిని వాడేవారు కొన్ని చిట్కాలను(Tips) తెలుసుకోండి. అవగాహనతో ఉండి అవసరం అయినప్పుడు ఉపయోగించుకోండి.
ఎలక్ట్రిక్ కార్లను(Electric Cars) డ్రైవ్ చేసి తీసుకొచ్చి పార్క్ చేసిన వెంటనే ఛార్జింగ్ పెట్టేయకూడదు. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో ఎండలో ఉంచి దీన్ని ఛార్జింగ్ చేయకపోవడమే మంచింది. రాత్రి సమయాల్లో లేదా తెల్లవారు జామున సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి ఆ సమయం వీటి ఛార్జింగ్‌కి అనువైనది. అలాగే బ్యాటరీ హెల్త్ ఎప్పుడూ బాగుండేలా చూసుకోవాలి. ఓవర్ ఛార్జింగ్ చేయకూడదు. అంటే బ్యాటరీ ఎప్పుడూ 20 శాతం నుంచి 80 శాతం వరకు మాత్రం ఛార్జింగ్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. ఛార్జ్ పెట్టి ఎక్కువ సేపు అలా ఉంచేసినా బ్యాటరీ తొందరగా దిగిపోయి పెర్ఫామెన్స్ తగ్గిపోతుంది.
వేసవి కాలంలో ఈవీ కార్లను(EV cars) ఎండలో పార్క్ చేయడం అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు నీడలోనే పార్కింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. అందువల్ల లోపలున్న బ్యాటరీ వేడెక్కకుండా ఉంటుంది. డ్రైవింగ్ రేంజ్ తగ్గకుండా ఉంటుంది. అలాగే టైర్లలో ప్రెజర్‌ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాతావరణం వేడిగా ఉంటే టైర్లలో ప్రెజర్ విపరీతంగా పెరిగిపోతుంది. అందుకనే తరచుగా దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి.