»Xiaomi Su7 Ev With More Than 650 Bhp Revealed Is Xiaomis First Electric Car
Xiaomi SU7 EV: షియోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు..ఫీచర్లు అదుర్స్
ప్రముఖ మొబైల్ కంపెనీ షియోమీ కార్ల తయారిలోకి అడుగుపెట్టింది. Xiaomi SU7 అనే ఎలక్ట్రిక్ వాహనాలను మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిలో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ హైపర్ OSని ఉపయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి.
Xiaomi SU7 EV with more than 650 bhp revealed, is Xiaomi's first electric car
Xiaomi SU7 EV: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ కార్ల తయారిలోకి అడుగుపెట్టింది. తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని చైనా రాజధాని బీజింగ్‌లో ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ కారుకు SU7 అని నామకరణం చేసింది. Xiaomi SU7 ఎలక్ట్రిక్ వాహనాలలో Lidarతో ఒకటి, Lidar లేకుండా రెండు వెర్షన్లను ప్రదర్శించింది. వీటిలో రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలు RWD, AWD ఉంటాయి. ఈ వాహనాలను ఎలక్ట్రిక్ సెడాన్ SU7, SU7 ప్రో, SU7 మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకిి తీసుకువస్తున్నారు.
RWD వెర్షన్ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఇది 295 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ 663 బీహెచ్పీని ఉత్పత్తి చేస్తుంది. AWD డ్రైవ్‌ట్రెయిన్ 295 bhp ఎలక్ట్రిక్ మోటార్, వెనుక ఇరుసుపై మౌంట్ చేయబడిన 368 bhp ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. మాములుగా ఎలక్ట్రిక్ వాహనాలు చాలా బరువును కలిగి ఉంటాయి. దానికి కారణం బ్యాటరీ అందువలన Xiaomi SU7 బరువు 1,980 కిలోలు అయితే టాప్-ఎండ్ ట్రిమ్ 2,205 కిలోల బరువు ఉంటుంది. తక్కువ వేరియంట్ల గరిష్ట వేగం 210 kmph, అధిక వేరియంట్లకు 265 kmph వేగంతో వస్తాయి.
Xiaomi SU7 భారీ ఉత్పత్తులను డిసెంబర్ 2023లో ప్రారంభమవుతుండగా, ఈ కార్లు వినియోగదార్లకు ఫిబ్రవరి 2024లో అందుబాటులో ఉంటాయని యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం బీజింగ్‌లో ఉన్న ఫ్యాక్టరీలో కార్ల టెస్టింగ్ మొదలైందని పేర్కొంది. Xiaomi SU7లో వారి కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ అయిన హైపర్ OSని ఉపయోగిస్తుంది. ఇదే కంపెనీ కొన్ని వారాల క్రితం తన స్మార్ట్ఫోన్ల కోసం హైపర్ ఓఎస్‌ను కూడా ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే Xiaomi స్మార్ట్ఫోన్లు హైపర్ OS పై నడుస్తున్న కార్లతో మాట్లాడగలిగే అవకాశం ఉంది.