పిల్లలతో ప్రధాని మోడీకి ఉన్న అనుబంధాన్ని ఎవరు దాచలేరు. అతను తరచుగా పబ్లిక్ ఈవెంట్లలో పిల్లలతో సరదాగా గడపడం మనం చూడవచ్చు. అలాంటి వీడియోనే తాజాగా మోడీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.
భారత ప్రధాని నరేంద్ర మోడీ తనకు సమయం దొరికనప్పుడల్లా చాలా సందర్భాలలో పిల్లలతో సరదాగా గడుపుతుంటారు. అవకాశం దొరికినప్పుడు పిల్లలతో గడపడం ఆపుకోలేక వారితో సరదాగా ఉంటారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఇటివల పిల్లలతో సరదాగా గడిపిన దృశ్యాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. మోడీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేయగా అది కాస్తా ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రధాని మోడీ పిల్లల తలలను దగ్గరకు తాకించారు. ఆ తర్వాత కొన్నిసార్లు తన నుదిటిపై నాణెం తగిలించుకుంటూ వారితో ఆటాడుకున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన క్రమంలో PM మోడీ క్యాప్షన్‌లో ఇలా రాశారు. మై యంగ్ ఫ్రెండ్స్ తో కొన్ని మరపురాని క్షణాలని పేర్కొన్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన మూడు గంటల్లోనే 11 లక్షలమందికి పైగా లైక్ చేయడం విశేషం. అంతేకాదు నైస్, గుడ్ అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
అయితే ప్రధాని మోడీ పిల్లలతో ఈ విధంగా గడపడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా అతను చాలా సందర్భాలలో పిల్లలతో నవ్వుతూ, సరదాగా గడిపారు. ఈ సంవత్సరం జాతీయ విద్యా విధానం మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అఖిల భారత విద్యా సదస్సు ప్రారంభ కార్యక్రమంలో కూడా ప్రధాని పిల్లలతో సమావేశమయ్యారు. అప్పుడు మోడీ ఆ చిత్రాన్ని X (గతంలో ట్విట్టర్)లో పిల్లలతో పంచుకున్నారు. “అమాయక పిల్లలతో కొన్ని క్షణాలు ఆనందంగా ఉంటాయని పేర్కొన్నారు. వారి శక్తి, ఉత్సాహం మనస్సును ఆనందంతో నింపుతాయని వెల్లడించారు.
ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్, ఎంపీ, మిజోరాంలో పలు ర్యాలీల్లో ప్రసంగించిన ఆయన ప్రధాని మోడీ ఇప్పుడు రాజస్థాన్‌లో ర్యాలీల్లో ప్రసంగించనున్నారు. రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో రెండో దశ పోలింగ్ జరగనుండడం గమనార్హం. నవంబర్ 25, 30 తేదీల్లో రాజస్థాన్, తెలంగాణల్లో ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడికానున్నాయి.