»Listing Of Tata Technologies Shares Bse And Nse 140 Percent Hike On Each Lot
Tata Technologies: షేర్ల లిస్టింగ్..ఒక్కో లాట్ పై రూ.21వేల లాభం
టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ (టాటా టెక్)షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్లో బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చాయి. దాని షేర్లు ఏకంగా 140 శాతం పెరిగి రూ.1,200 వద్ద లిస్ట్ అయ్యాయి. దీంతో ఈ షేర్లు తీసుకున్న మదుపర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Listing of Tata Technologies shares bse and nse 140 percent hike on each lot
టాటా టెక్నాలజీస్(tata technologies) లిమిటెడ్ షేర్లు గురువారం దలాల్ స్ట్రీట్లో బ్లాక్బస్టర్ గా అరంగేట్రం చేశాయి. దాని ఇష్యూ ధర కంటే 140 శాతం ప్రీమియంతో NSEలో రూ.1,200కి లిస్ట్ చేయబడ్డాయి. బిఎస్ఇలో రూ.1,199.95 వద్ద ట్రేడ్ అయ్యాయి. లిస్టింగ్ అయిన వెంటనే టాటా టెక్నాలజీస్ షేర్లు బిఎస్ఇలో 16 శాతంపైగా పెరిగి ఒక దశలో రూ.1,400కి చేరాయి. ఇష్యూ ధర రూ.500 కంటే ఇది 140 శాతం ప్రీమియం పెరగడం పట్ల ఈ షేర్లు తీసుకున్న మదుపర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ షేర్ల ఒక్క లాట్ 30 ఉండగా..మొత్తం రూ.15 వేలకు కొనుగోలు చేస్తే..ఒక్క లాట్ పై రూ.20 వేలకుపైగా లాభం వచ్చింది.
టాటా టెక్ దాదాపు రెండు దశాబ్దాలలో టాటా గ్రూప్ ద్వారా మొదటి సారి IPO రావడంతో పెట్టుబడిదారులు కూడా పెద్ద ఎత్తున తీసుకున్నారు. ప్రధానంగా ఈ షేర్లు IPO అన్ని వర్గాల పెట్టుబడిదారుల నుంచి భారీ ఆసక్తిని పొందాయి. మొత్తం 73.38 లక్షల దరఖాస్తులు వచ్చాయి. పబ్లిక్ ఆఫర్ 69.43 రెట్లు సబ్స్క్రయిబ్ చేయబడింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) కోసం రిజర్వ్ చేయబడిన కోటా రికార్డ్ 203.41 రెట్లు బుక్ చేయబడింది. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐలు), రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించిన భాగం వరుసగా 62.11 సార్లు, 16.50 సార్లు బుక్ చేయబడింది.
ఆటోమోటివ్ ఇంజినీరింగ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా టెక్నాలజీస్ దలాల్ స్ట్రీట్లో అంచనాలను మించి గురువారం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. బిఎస్ఇ(BSE)లో రూ.1,200 వద్ద లిస్టయిన ఈ స్టాక్ ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసింది. ప్రారంభానికి ముందు, ఈ షేర్ 86 శాతం లేదా గ్రేలో రూ.430 ప్రీమియంతో ఉంది. అయితే ఈ షేర్లు తీసుకున్న వారు ప్రస్తుతం అదృష్టవంతులని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తీసుకుందామని అనుకుని కొనకుండా ఉన్న వారు అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నామని అనుకుంటున్నారు.