»Lic New Scheme Jeevan Utsav Plan If You Pay Five Year Life Time Income
LIC నుంచి కొత్త స్కీం..ఐదేళ్లు కడితే చాలు లైఫ్‌టైం ఇన్ కం
జీవిత బీమా గురించిన ఆలోచన వచ్చినప్పుడల్లా, ముందుగా గుర్తుకు వచ్చే పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సంస్థ ఈరోజు కొత్త పాలసీని ప్రారంభించింది. ఈ పాలసీ పేరు జీవన్ ఉత్సవ్. ఈ పాలసీలో, పాలసీదారుడు అధిక వడ్డీ రేటుతోపాటు అనేక సౌకర్యాల ప్రయోజనాన్ని పొందుతారు.
lic jeevan utsav plan New scheme from LIC If you pay five year life time income
బీమా రంగంలో దిగ్గజ సంస్థ ఎల్ఐసీ ఈరోజు(నవంబర్ 29న) గ్యారెంటీ రిటర్న్ పథకం జీవన్ ఉత్సవ్ ను ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సేవింగ్, హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అని ఎల్ఐసి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత బీమా మొత్తంలో 10 శాతం జీవితకాల ప్రయోజనాన్ని పాలసీదారులు పొందవచ్చని ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 20-25 సంవత్సరాల వ్యవధిలో పారదర్శక వ్యయ నిర్మాణం, రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులకు ఇది సరైన ఎంపిక అని వెల్లడించారు. ఇది కాకుండా ఈ ఉత్పత్తిలో పాలసీదారు రుణం, ప్రీ-మెచ్యూర్ వంటి అనేక సౌకర్యాల కూడా పొందుతారని ఆయన చెప్పారు. ఈ పాలసీ ఒకసారి తీసుకుని ఐదేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందవచ్చని వెల్లడించారు.