Lic: వచ్చే నెల మొదటి వారంలో కొత్త పాలసీ తీసుకొస్తామని ఎల్ఐసీ (Lic) ప్రకటించింది. ఆ పాలసీకి మంచి ఆదరణ లభించనుందని సంస్థ చైర్మన్ మొహంతి అభిప్రాయపడ్డారు. కచ్చితమై రాబడితోపాటు కాల పరిమితి ముగిసిన తర్వాత హామీ మొత్తంతో 10 శాతం జీవితకాలం అందేలా పాలసీ రూపొందిస్తున్నామని తెలిపారు. తమ పెట్టుబడి 20-25 ఏళ్ల తర్వాత ఎంత వస్తుందనే అంశంపై ఫోకస్ చేశారని వివరించారు. తమ కొత్త పాలసీకి మంచి స్పందన లభించనుందని చెప్పారు. లోన్, ముందే పాలసీ విత్ డ్రా చేసుకునే సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు.
ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో ఎల్ఐసీ (Lic) బిజినెస్ 2.65 శాతం పెరిగిందని వివరించారు. దీంతో సంస్థకు రూ.25,184 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పాలసీ తీసుకున్న ఫస్ట్ ఇయర్లో పాలసీదారులు చెల్లించే ప్రీమియంతోపాటు.. ఏక మొత్తంలో చెల్లించే ప్రీమియం మొత్తాన్ని కొత్త బిజినెస్ ప్రీమియంగా పరిగణిస్తామని తెలిపారు. దీంతో ఎల్ఐసీ 58.50 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది.