»Bajaj Pulsar These Are The Features Of Bajajs New Pulsar Bike
Bajaj Pulser: బజాజ్ కొత్త పల్సర్ బైక్ ఫీచర్లు ఇవే!
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. పల్సర్ ఎన్ఎస్400జెడ్ పేరుతో దీన్ని లాంచ్ చేశారు. మరి దీని ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.
Bajaj Pulsar: These are the features of Bajaj's new Pulsar bike!
Bajaj Pulser: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో కొత్త పల్సర్ బైక్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. పల్సర్ ఎన్ఎస్400జెడ్ పేరుతో దీన్ని లాంచ్ చేశారు. దీని ధర రూ.1.85 లక్షలు ఉంది. గ్లోసీ రేసింగ్ రెడ్, ప్యూటర్ గ్రే, మెటాలిక్ పెరల్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్ రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ మోడల్ అని కంపెనీ పేర్కొంది. ఇందులో 373cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 8,800rpm వద్ద 40bhp పవర్‌ను, 6,500rpm వద్ద 35Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 154kph టాప్ స్పీడ్‌ను బైక్ అందుకుంటుంది. సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు.
ముందువైపు 320mm డిస్క్ బ్రేక్, వెనక వైపు 230mm రియర్ డిస్క్ బ్రేక్ ఇస్తున్నారు. స్పోర్ట్స్ రోడ్, రైన్, ఆఫ్- రోడ్ నాలుగు విభిన్న రైడింగ్ మోడ్లు ఉన్నాయి. ఈ బైక్ డ్యూయల్ ఛానెల్ ABS డిస్క్ బ్రేక్‌లతో వస్తోంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం బుకింగ్స్ మొదలయ్యాయి. రూ.5000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూన్ మొదటివారంలో డెలివరీలు ప్రారంభం అవుతాయి. ప్రపంచంలోనే తొలిసారిగా సీఎన్జీతో నడిచే ద్విచక్ర వాహనాన్ని తీసుకురానున్నట్లు బజాజ్ ఆటో ఇప్పటికే పలుమార్లు తెలిపింది. బైక్ లాంచింగ్ తేదీని తాజాగా ప్రకటించింది. జూన్ 18న తొలి సీఎన్జీ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ బజాజ్ తెలిపారు.