»These Are The Best Smart Watches Under 1500 With Amazing Features
Smart Watches: అదిరిపోయే ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ వాచెస్
స్మార్ట్ వాచ్ కొనాలి అనుకుంటున్నారా.. అయితే మీ కోసం అతి తక్కవ ధరలో బెస్ట్ వాచెస్ ఏవో మీరే చూసి తెలుసుకోండి. ఈ పండక్కి మరిన్ని ఆఫర్లతో ఆన్లైన్ సైట్లు క్యూ కడుతున్నాయి. కన్ఫ్యూజ్ అవకుండా క్లారిటీగా చదివి తెలుసుకోండి.
These are the best smart watches under 1500 with amazing features
Smart Watches: స్మార్ట్ వాచ్‌లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో స్మార్ట్ ఫోన్ జేబులో నుంచి బయటకు తీసే అవసరం లేదు. కాల్స్ చేయడం మాత్రమే కాదు యూట్యూబ్ వీడియోలు సైతం మన మణికట్టుపై చూసే సౌలభ్యం కల్పిస్తుంది. హెల్త్ ట్రాకింగ్, స్పోర్ట్స్, నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్.. ఇలా ఒకటేమిటి అన్నీ ఈ స్మార్ట్ వాచ్ తోనే కంట్రోల్ చేయొచ్చు. స్మార్ట్ వాచ్‌లు కంపెనీని బట్టి రేట్లు ఉంటాయి. అన్ని ఫీచర్లతో తక్కువ ధరకే బ్రాండెడ్ వాచ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. చాలా మంది రూ. 1500 లోపు వాచ్‌లను కొనడానికి ఆసక్తి చూపిస్తారు.
పీట్రాన్ రిఫ్లెక్ట్ కాల్జ్ స్మార్ట్‌వాచ్
మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన స్మార్ట్ వాచ్ ఇది. మెటల్ స్ట్రాప్ తో పాటు 2.5 డీ కర్వ్ డ్ డిస్ ప్లేతో ఉన్న ఈ స్మార్ట్ వాచ్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. రియల్ టైం హార్ట్ రేట్ చెకప్, ఆక్సిజన్ లెవల్స్, బీపీ, స్టెప్ కౌంట్ తదితర హెల్త్ ట్రాకర్లు, ఐపీ 68 రేటింగ్, వాటర్ రెసిస్టెంట్‌తో అందుబాటులో ఉంది. ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫాం అమెజాన్ లో రూ.999 లకే ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది.
ఫైర్-బోల్ట్ నింజా 3 ప్లస్
తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్మార్ట్ వాచ్ కొనాలని అనుకునే వారికి ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ మంచి ఛాయిస్.. వివిధ హెల్త్ ట్రాకర్లతో పాటు వందకు పైగా స్పోర్ట్స్ మోడ్ లు, వందకు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ లతో పాటు 1.83 అంగుళాల పెద్ద స్క్రీన్ ఈ స్మార్ట్ వాచ్ సొంతం. ఇందులో బ్లూటూత్ వాయిస్ కాలింగ్ సదుపాయం మాత్రం లేదు. అమెజాన్ లో రూ.999 లకే ఈ స్మార్ట్ వాచ్ ను సొంతం చేసుకోవచ్చు.
బీట్ ఎక్స్‌పి మార్వ్ ఆరా
1.83 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్, హెల్త్ ట్రాకర్ తదితర ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్ వాచ్ 60 హెర్జ్ రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ను కలిగి ఉంది. వాటర్ ప్రూఫ్ డిజైన్ తో పాటు 100కు పైగా స్పోర్ట్స్ మోడ్ లు, ఏఐ వాయిస్ అసిస్టెంట్ కమాండ్ ఫీచర్ కూడా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.1,099. అమెజాన్ లో అందుబాటులో ఉంది.
నాయిస్ పల్స్ 2 మ్యాక్స్
స్మార్ట్ డీఎన్ డీ ఫీచర్ తో పాటు పది రోజుల బ్యాటరీ లైఫ్ తో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్ ఇది.. ఈ స్మార్ట్ వాచ్ లో పిక్చర్ క్వాలిటీ అద్భుతంగా ఉందని కస్టమర్ ఫీడ్ బ్యాక్ ద్వారా తెలుస్తోంది. బ్లూటూత్ వాయిస్ కాలింగ్ ఆప్షన్ సాయంతో జేబులో నుంచి ఫోన్ బయటకు తీయకుండానే ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. దీని ధర రూ.1,299.. అమెజాన్ లో అందుబాటులో ఉంది.
బోట్ వేవ్ సిగ్మా
చాటింగ్‌కు బాగా ఉపకరించే స్మార్ట్ వాచ్ ఇది.. బ్లూటూత్ కాలింగ్, ఇంటర్నల్ స్పీకర్, మైక్రోఫోన్ లతో ఆకట్టుకునే డిజైన్ తో కంపెనీ దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాటరీ లైఫ్ 5 రోజులు.. స్లీప్ సైకిల్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సౌలభ్యం ఉంది. అమెజాన్ లో దీని ధర రూ.1,499.