99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ MG మోటార్ ఇండియా ఈరోజు(ఏప్రిల్ 27న) తన స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం MG కామెట్ EVని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నగరంలో సాఫీగా, ఒత్తిడి లేని ప్రయాణం చేయడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. అయితే ఈ వాహనం ఫీచర్లు, ధరను ఇప్పుడు తెలుసుకుందాం.
అర్బన్ మొబిలిటీ పరిణామం పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో MG కామెట్ EVని ప్రారంభించడం సంతోషంగా ఉందని MG మోటార్ ఇండియా ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. కామెట్ EV కారు కంటే ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తూ నగరాల్లో సులభంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కామెట్ ఈవీ(comet ev) స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ జీఎస్ఈవీ (GSEV)ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించగా.. స్టైల్, టెక్నాలజీ సహా అసమానమైన భద్రతా లక్షణాలతో విశాలమైన రైడ్‌ను అందిస్తుందని రాజీవ్ చాబా అన్నారు.
MG మోటార్ ఇండియా 99 ఏళ్ల వారసత్వం కలిగిన బ్రిటిష్ ఆటోమొబైల్ బ్రాండ్ భారతదేశంలో అర్బన్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రకటిస్తూ స్మార్ట్ ఎలక్ట్రిక్ వాహనం కామెట్ ఈవీ(comet ev)ని నేడు(ఏప్రిల్ 27న) ఆవిష్కరించింది. బహుముఖ జీఎస్ఈవీ-ప్లాట్‌ఫారమ్-ఆధారిత ప్యూర్ ఈవీతోపాటు విశాలమైన డిజైన్‌తో నగరంలో సాఫీగా ప్రయాణాన్ని స్వాభావంతో అందుబాటులోకి వచ్చింది. కామెట్ ఈవీ ఎంజీ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో ఇది రెండో ఈవీ. స్మార్ట్ ఈవీ ఎంజీ కామెట్ ప్రస్తుత ధర రూ.7,98,000 (ఎక్స్ షోరూమ్) వద్ద అందుబాటులో ఉంది.
కామెట్ ఈవీ అన్ని అంశాలలో లోపలి నుంచైనా లేదా బయటి నుంచైనా సురక్షితమైన, పటిష్టమైన వాహనం. ఇది 17.3 kWh లిథియం ఐయాన్ బ్యాటరీతో పాటు ప్రిస్మాటిక్ సెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇది సుదీర్ఘ సైకిల్ లైఫ్ కోసం 39 కఠినమైన భద్రతా పరీక్షలను ఎదుర్కొంది. ఇది ఐపీ67-రేటెడ్‌తో నీరు, ధూళి నుంచి అధిక నిరోధకతను కలిగి ఉంటుంది. వీటన్నింటితోపాటు ఇది 17 హాట్ స్టాంపింగ్ ప్యానెల్లతో కూడిన హై స్ట్రెంత్ వెహికల్ బాడీ ఎంజీ కామెట్ ఈవీ మొత్తం నిర్మాణాన్ని బలంగా, సురక్షితంగా ఉంచుతుంది. స్మార్ట్ ఈవీ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ +ఈబీడీ, ఫ్రంట్ & రియర్ 3 పాయింట్, సీట్ బెల్ట్‌లు ఉన్నాయి. దీంతోపాటు సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష), ISOFIX చైల్డ్ సీట్ వంటి సౌకర్యాలు కూడా దీనిలో ఉన్నాయి.
స్మార్ట్ టెక్
ఇంటెలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్ విభాగంలో ఎంజీ కామెట్ ఈవీ లేటెస్ట్ ఫీచర్లను అందిస్తుంది. అంతర్నిర్మిత ఐస్మార్ట్ (iSmart)సిస్టమ్ 100+ వాయిస్ కమాండ్లు, 55+ కనెక్టెడ్ కార్ ఫీచర్లతో వస్తుంది. ఇది 10.25” హెడ్ యూనిట్, 10.25″ డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్ను కలిగి ఉంది. అంతేకాదు ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ మూడు శ్రేణులను కల్గి ఉంది. MG కామెట్ EV మరో ప్రత్యేక లక్షణం ఎంటంటే స్మార్ట్ కీ సౌకర్యం కూడా ఉంది.
స్మార్ట్ సేవింగ్
పట్టణ యువతతోపాటు ఇతర ప్రయాణీకులకు పొదుపు చాలా అవసరం. అయితే ఈ వాహనం ఉపయోగించడం ద్వారా ఇంధన ధరలతో పోల్చుకుంటే ప్రతి 1,000 కి.మీ.కు మీరు రూ.519 చొప్పున పొదుపు చేసే అవకాశం ఉంది.
స్మార్ట్ చాయిస్
అదనంగా MG కామెట్ EV రెండు ప్రత్యేక ఎడిషన్లను కూడా ప్రవేశపెట్టింది. గేమర్ ఎడిషన్, LIT ఎడిషన్. పట్టణ ప్రయాణికుల వ్యక్తిత్వాలకు అనుగుణంగా వీటిని రూపొందించారు. MG కామెట్ EV 250+ డెకాల్, గ్రాఫిక్స్ మొదలైన వాటితో సహా అనేక ఫీచర్లతో వస్తుంది.