జియో టెలికం మార్కెట్లోకి ఎలా చొచ్చుకుపోయిందో గుర్తు తెచ్చుకోండి. డేటా, కాల్స్ అన్ లిమిటెడ్ గా ఉచితం. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్లను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) కూడా ఇదే బాటలో నడుస్తోంది.
ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్ఫాట్ అమెజాన్ ప్రైమ్ తన యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. మొదట్లో అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వార్షిక ప్లాన్ ధర కేవలం రూ.500. కానీ, ఆ తర్వాత రూ.999 చేసింది. ఆ తర్వాత ఇది కాస్తా రూ.1,499 కు చేరింది. ఇప్పుడు నెలవారీ అమెజాన్ ప్రైమ్ కోరుకునే వారు రూ.299 పెట్టి రీచార్జ్ చేసుకోవాల్సిందే.ఇప్పటి వరకు ఇది రూ.179 గానే ఉంది. అంటే దాదాపు 80 శాతానికి పైనే పెంచింది. మూడు నెలలకు ఉన్న రూ.459 కాస్తా రూ.599కు చేరిపోయింది. కాస్త ఉపశమనం ఏమిటంటే వార్షిక ప్లాన్ (Annual plan) ఇప్పటి వరకు రూ.1,499గా ఉంటే, దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు.
దీర్ఘకాల రీచార్జ్ (Recharge) లను పెంచుకునే వ్యూహంతో నెలవారీ, మూడు నెలల ప్లాన్లలో మార్పులు చేసినట్టు కనిపిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లైట్ వార్షిక ధర రూ.999.ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ సేవలను భారత్లో 2016లో తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తీసుకున్న వారికి ముందుగా వస్తువులు డెలివరీ చేయడం, ప్రైమ్ వీడియో(Prime Video), ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ డీల్స్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, అమెజాన్ ఫ్యామిలీ వంటి అదనపు సదుపాయాలను అందిస్తున్నారు. జియో ప్రజలకు అలవాటు చేసి క్రమంగా పెంచుతూ పోతోంది. ఫ్రీగా సిమ్ తీసుకుని వాడుకోండి. ఈ విధమైన ఆఫర్లతో యూజర్ల(of users)ను సొంతం చేసుకుంది జియో. అలా ఏడాది పాటు అన్నీ ఉచితంగా ఇచ్చిన సంస్థ నెలవారీ చేసుకోవాల్సిన రీచార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఆ తర్వాత నుంచి క్రమంగా వీటిని పెంచుతూ పోతోంది. ఇప్పుడు ఒక నెలకు కనీసం రూ.200 పెట్టుకుంటేనే సేవలు.