బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(bandi sanjay kumar)పై పోలీసులు వేసిన బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు కొట్టివేసింది. సంజయ్ కి బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోరగా.. విచారణకు సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కానీ ప్రాసిక్యూషన్ వాదనలతో మేజిస్ట్రేట్ విభేదించారు. బెయిల్ రద్దుకు తగిన కారణాలు లేవని సంజయ్ తరఫు న్యాయవాది వాదించారు.
మరోవైపు షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్(bail) రద్దు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసుల పిటిషన్ ను సేహుతుకం కాదని కొట్టివేసింది. అయితే 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో లీకేజీ కావడంపై బండి సంజయ్ ని అరెస్టు చేసి..ఏప్రిల్ 6న బెయిల్ మంజూరు చేశారు.