Uppal Skywalk : మే మొదటి వారంలో ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
ఉప్పల్(Uppal), సికింద్రాబాద్, ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రో స్టేషన్‌తో ఈ వంతెనను అనుసంధానించారు. ఈ నిర్మాణంతో ప్రయాణికులకు పెద్ద ఊరట లభించనుంది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాతనంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన స్కైవాక్ (Skywalk)పనులు తుది దశకు చేరుకున్నాయి. మే నెల మొదటి వారంలో ఈ స్కైవాక్ ప్రారంభించేందుకు హెచ్ఎండీఏ (HMDA) సిద్దమవుతోంది. ఈ స్కైవాక్‌ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్‌ను వినియోగించి, అధునాతనంగా స్కైవాక్‌ను తీర్చిదిద్దారు.స్కైవాక్‌కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ(GHMC) ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్(Warangal Bus Stop), ఉప్పల్ పోలీసు స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ఉప్పల్ జంక్షన్ (Uppal Junction) వాహనాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ స్కైవాక్ నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. కాలినడకన వెళ్లే వారు ఎక్కడా రోడ్డును దాటే అవసరం లేకుండా.. స్కైవాక్ నుంచి అటు నుంచి ఇటువైపు.. ఇటు నుంచి అటు వైపు ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. మెట్రో స్టేషన్ (Metro station)కు కూడా అన్ని కూడళ్ల నుంచి ఈ స్కైవాక్ నుంచి నేరుగా చేరుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్‌ను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ తెలిపింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సూచనల మేరకు ఉప్పల్ స్కైవాక్‌ను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ పేర్కొన్నది