»Annamayya District Municipal Councillor Resigned For Teacher Job In Madanapalle
Politics వద్దు.. Teacher ఉద్యోగం ముద్దు.. పదవికి రాజీనామా చేసిన మహిళా నేత
ప్రభుత్వ పదవి ఏదో ఒకటి పొందాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ పదవిని త్యజించారు. టీచర్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమె మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తున్నారు.
ఉపాధ్యాయ (Teacher) వృత్తి గౌరవప్రదమైనది.. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే. కానీ రాజకీయం (Politics) వేరు. ఆ వృత్తికి ఈ వృత్తికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆమె ఉపాధ్యాయురాలిగా కావాలనుకుంది. పరీక్ష రాసింది.. ఉద్యోగం సాధించింది. కానీ ఉద్యోగ ఉత్తర్వులు రాలేదు. గిర్రున పాతికేళ్లు తిరిగాయి. అప్పుడు రాసిన ఉద్యోగం 25 ఏళ్ల తర్వాత వచ్చింది. కానీ ఆమె రాజకీయాల్లో బిజీగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగంలో చేరుతుందో లేదోనని అందరూ అనుకున్నారు. కానీ ఆమె అనూహ్యంగా టీచర్ ఉద్యోగం (Teacher Job) ముందు ఈ పదవి పనికిరాదని తేల్చి చెప్పేసింది. ఉత్తర్వులు అందుకోగానే ఆమె తన పదవికి రాజీనామా (Resign) చేసింది. ఈ సంఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో (Annamayya District) జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
మదనపల్లికి (Madanapalle) చెందిన గీతాశ్రీ 1998లో డీఎస్సీ (DSC) పరీక్ష రాశారు. ఉద్యోగానికి ఎంపికయ్యారు. కానీ రకరకాల కారణాలతో ఆమెకు అపాయింట్ మెంట్ లేఖ (Appointment Letter) రాలేదు. ఈలోపు గీతాశ్రీ టీడీపీలో చేరి మదనపల్లి మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ (Municipal Councillorగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా కొనసాగుతున్నారు. ఈనెల 13వ తేదీన టీచర్ ఉద్యోగానికి ఎంపికయ్యారనే అధికారిక ఉత్తర్వు చేరింది. ఆమెను ఉపాధ్యాయురాలిగా నియమిస్తూ జిల్లా విద్య శాఖ అధికారి (డీఈఓ) ఉత్తర్వులు పంపించారు. వాటిని అందుకున్న గీతాశ్రీ ఉబ్బితబ్బబయ్యారు. తాను కలగన్న ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారు.
ప్రభుత్వ పదవి ఏదో ఒకటి పొందాలి కాబట్టి మున్సిపల్ కౌన్సిలర్ పదవిని త్యజించారు. టీచర్ గా కొనసాగేందుకు నిర్ణయించుకున్న ఆమె మదనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను మదనపల్లి మున్సిపల్ కమిషనర్ (Commissioner) వెంటనే ఆమోదించారు. రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు పాఠశాలలో ప్రశాంతంగా విద్యార్థులకు బోధన చేస్తున్నారు. కాగా ఆమెకు వచ్చింది శాశ్వత నియామకం కాదు. కాంట్రాక్ట్ టీచర్ (Contract Teacher)గా ఆమెను ప్రభుత్వం నియమించింది. ఆమెకు జీతం రూ.32,670 దక్కనుంది.