»Karnataka Congress Filed Complaint Criminal Case On Amit Shah In Bengalurus High Grounds
Amit Shahకు భారీ షాక్.. Karnatakaలో క్రిమినల్ కేసు నమోదు
అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు.
విద్వేషపూరిత రాజకీయాలు.. ప్రజల మధ్య చిచ్చురేపడం.. అల్లర్లు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. చాలా రాష్ట్రాల్లో ఇలాంటి రాజకీయాలు చేసి ఓట్లు రాబట్టుకునే దారుణ రాజకీయాలు కాషాయ పార్టీ కొనసాగిస్తోంది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇదే వ్యవహారంతో రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా (Amit Shah) కర్ణాటక ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు మత రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ప్రకటించడం.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వస్తే అల్లర్లు చెలరేగుతాయి అని ప్రకటించడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయపరంగానే కాక న్యాయపరంగా కూడా అమిత్ షాతో పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అమిత్ షాపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం కర్ణాటకలో (Karnataka) సంచలనంగా మారింది.
కమీషన్ ప్రభుత్వంగా (Commission Govt) గుర్తింపు పొందిన కర్ణాటకలో ఈసారి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశం ఉంది. అభివృద్ధి వదిలేసి విద్వేష రాజకీయాలు కొనసాగిస్తున్న కమలం పార్టీని ప్రజలు ఓడిస్తారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇది గ్రహించిన అమిత్ షా తమ విద్వేష రాజకీయాలకు తెరలేపారు. ఈ క్రమంలోనే పై వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ (Bengalurus High Grounds)లో అమిత్ షాపై కేసు నమోదైంది.
పార్టీ సీనియర్ నాయకుడు రణదీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Singh Surjewala), డాక్టర్ జి పరమేశ్వర్ (Dr Parmeshwar), కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివ కుమార్ (DK Shivakumar) తదితరులు గురువారం పోలీస్ స్టేషన్ కు చేరుకుని అమిత్ షా వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ‘ప్రజలను రెచ్చగొట్టేలా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసి బీజేపీకి ఓటు వేయాలని అమిత్ షా హెచ్చరించాడు. అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పుదు. ఆ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పోలీసులకు ఫిర్యాదు చేశాం’ అని కర్ణాటక కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
ಎಐಸಿಸಿ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳಾದ @rssurjewala, ಕೆಪಿಸಿಸಿ ಅಧ್ಯಕ್ಷರಾದ @DKShivakumar ಅವರು, ಕಾಂಗ್ರೆಸ್ ಅಧಿಕಾರಕ್ಕೆ ಬಂದರೆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಹಿಂಸಾಚಾರ ನಡೆಯುತ್ತದೆ ಎಂದು ರಾಜ್ಯದ ಮತದಾರರಿಗೆ ಬೆದರಿಕೆ ಒಡ್ಡಿರುವ ಕೇಂದ್ರ ಗೃಹ ಸಚಿವ @AmitShah ಅವರ ವಿರುದ್ಧ ಬೆಂಗಳೂರಿನ ಹೈ ಗ್ರೌಂಡ್ಸ್ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಸಲ್ಲಿಸಿದರು. pic.twitter.com/wi9Z6rzxgL