»For Youtube Channel Monetization Govt Teacher Who Leaked Exam Papers
Viral News: యూట్యూబ్ ఛానెల్ మ్యానిటైజేషన్ కోసం.. పరీక్ష పత్రాలు లీక్ చేసిన టీచర్
యూట్యూబ్ ఛానెల్ కోసం ప్రభుత్వ టీచర్ పేపర్లను లీక్ చేశాడు. దీంతో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన సంచనంగా మారింది. నెటిజన్లు అతడిపై కామెంట్స్ చేస్తున్నారు.
For youtube channel monetization.. Govt teacher who leaked exam papers
Viral News: యూట్యూబ్ ఛానల్‌కు మానిటైజేషన్ కోసం ఓ ప్రభుత్వ టీచర్ నీచానికి ఒడిగట్టాడు. 1 నుంచి 8 వ తరగతి వార్షిక పరీక్ష ప్రశ్న పత్రాలను ఛానల్లో అప్లోడ్ చేశాడు. వీడియో కాస్త వైరల్ అయింది. పైఅధికారుల దృష్టికి వెళ్లింది. అతను చేసిన పనికి ఆగ్రహించిన అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో అతడినిక పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… నిందితుడు జగన్నాథ్ కార్ సమాజంలో మంచి గౌరవమున్న ప్రభుత్వ ఉపాద్యాయుడు. ఒడిశాలోని జజ్పూర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.
29 ఏళ్ల జగన్నాథ్ కార్ జజ్పూర్ జిల్లాల్లోని గోపీనాథ్ జ్యూ నోడల్ స్కూల్లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు తమకు సమాచారం వచ్చిందని ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. దీనపై విచారిస్తే కార్ చేసిన పని తెలిసిందన్నారు. పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు నిందితుడు ప్రశ్నపత్రాలు తీసుకున్నాడని తెలిపారు. స్కూలుకు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్‌తో ఫొటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడని వివరించారు. ఫలితంగా వారి ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 5 వేల నుంచి 30 వేలకు చేరుకుందని, అతడు ఆశించినట్లు మానిటైజేషన్ కూడా అయినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు.