Solar Eclipse: మరో రెండు రోజుల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంటే ఏప్రిల్ 8న ఇది సంభవించనుంది. మెక్సికో, అమెరికా, కెనడాలో ప్రారంభమై నార్త్ అమెరికాను దాటుతూ సంపూర్ణంగా కనిపించనుంది. వీటితో పాటు కరీబియన్ దేశాలు అయినా మెక్సికో, స్పెయిన్, వెనెజువెలా, కొలంబియా, యూకే, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్ ల్యాండ్ దేశాల్లో పాక్షిక గ్రహణం కనబడనుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. పీడీటీ కాలమానం ప్రకారం మెక్సికోలో ముందుగా గ్రహణం 11:07కి కనిపిస్తుందని నాసా వెల్లడించింది. ఆ తర్వాత మైన్ వద్ద సుమారు 01:30కి ముగుస్తుంది.
ఇండియన్ స్టాండర్డ్ టైం (IST) ప్రకారం ఇండియాలో అదే రోజు రాత్రి 9:12కి మొదలై అర్ధరాత్రి దాటాక 02:22కి ముగుస్తుంది. ఆ సమయంలో భారత్లో సూర్యుడు కనిపించడు కాబట్టి ఇక్కడ సంపూర్ణ సూర్యగ్రహణం చూసే అవకాశం లేదు. భారతీయులు ఈ అద్బుతాన్ని చూడాలంటే నాసా ప్రత్యక్షప్రసారాన్ని చూడాల్సిందే. నాసాతోపాటు టెక్సాస్లోని మెక్ డొనాల్డ్ అబ్సర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంది. గ్రహణ సమయంలో నెగెటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చాలా కాలంగా భారతీయులు కొన్ని అలవాట్లను ఆచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటకు రావద్దని, ఆ సమయంలో ఎవరు ఆహారం తినొద్దని నమ్ముతున్నారు. కొన్ని స్టడీలు అలాంటివి కేవలం అపోహాలుగానే కొట్టేస్తున్నాయి. అయితే నాసా చెప్పినదాని ప్రకారం ఆ సమయంలో రేడియేషన్ కారణంగా వాతావరణంలో మార్పులు సంభవిస్తాయని, అది ఆహారంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వెల్లండిచింది. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.