Burning in the forests of Nallamala.. burning forest
Nallamala forest: దక్షిణ భారతదేశంలో నల్లమల అడవి(Nallamala forests)లకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది. దట్టమైన అడవి ప్రాంతం అది. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా కర్నూలు జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కడప జిల్లాలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. సంవత్సరం పొడవునా ఇక్కడ వేడిగానే ఉంటుంది. ఇప్పుడు ఎండలు మండిపోతున్నాయి. భానుడి సెగతో చెట్ల రాపిడితో అడవి అట్టుకుంటుంది. ఇటీవలే నల్లమలలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలసింది. అది సమసిపోయింది అనుకున్న తరుణంలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం(Massive fire) చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్(Nagar Kurnool) జిల్లా ఆమ్రాబాద్(Amrabad) మండలం తాళ్లచెలుక, గుండం(Gundam) ప్రాంతాల్లో సుమారు 100 వంద ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లు, అక్కడ ఉన్న చెట్లు అన్ని దగ్ధమైనట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి మంటలు అంటుకున్నట్లు సమాచారం. ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ వెళ్లిన వారు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని అధికారులు ప్రయాత్నాలు ముమ్మరం చేశారు. అలాగే అడవిలో జీవించే జంతులను కూడా రక్షించే చర్యలు చేపట్టారు. మంటలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.