ఏపీలోని అన్నమయ్య జిల్లా(annamayya district)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. వేగంగా వచ్చిన తుఫాను వాహనం, లారీ వచ్చి ఒకదానికొకటి బలంగా ఢీకొట్టాయి. ఈ క్రమంలో రెండు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. దీంతోపాటు వాహనాల్లో ఉన్నవారిలో ఐదుగురు మృత్యువాత చెందగా..మరో 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తిరుమలకు వచ్చి వారి ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగింది. విషయం తెలిసిన పోలీసులు(police), స్థానికుల సాయంతో వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. అంతేకాదు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్లియర్ చేశారు. అయితే మృతులు కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులని తెలుస్తోంది.