»Hyderabad Telangana High Court Cancels Erra Gangireddy Bail In Ys Viveka Murder Case
YS Viveka హత్య కేసులో కీలక పరిణామం.. ఎర్ర గంగిరెడ్డి Bail రద్దు
మే 5వ తేదీలోపు సీబీఐ ముందు ఎర్ర గంగిరెడ్డి లొంగిపోవాలి అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆయన లొంగిపోకపోతే అరెస్ట్ చేసే అవకాశం సీబీఐకి ఉందని ధర్మాసనం తెలిపింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసును త్వరగా ముగించాలనే సీబీఐ భావిస్తున్నది. ఈ క్రమంలోనే రోజుకో పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి (Erra Gangi Reddy) బెయిల్ ను తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) రద్దు చేసింది. దీంతో వైఎస్సార్ సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి. గతంలో అరెస్టయిన అతడు బెయిల్ (Bail)పై బయట ఉన్నాడు. కాగా ఈ కేసులో కీలక పరిణామాల నేపథ్యంలో గంగిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేసి విచారణకు రావాల్సిందిగా సీబీఐ (CBI) భావిస్తోంది. ఈ క్రమంలోనే గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం తీర్పును వెలువరించింది. ‘మే 5వ తేదీలోపు సీబీఐకి లొంగిపోవాలి’ అని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఆయన లొంగిపోకపోతే అరెస్ట్ (Arrest) చేసే అవకాశం సీబీఐకి ఉంది’ అని ధర్మాసనం తెలిపింది.
వివేక హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బయట ఉండడంతో దర్యాప్తుకు (Investigation) సహకరించేందుకు ప్రజలు ఎవరూ ముందుకు రావడం లేదని సీబీఐ వాదించింది. అతడి వెనుక రాజకీయ ప్రముఖులు (Political Leaders) ఉన్నారని, అందువలన విచారణకు ప్రజలు రావడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం సీబీఐ వాదనతో ఏకీభవించింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి లొంగిపోవావాలని ఆదేశించింది.