Road accident on Gorakhpur Kushinagar highway six people dead and 27 injured
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా(annamayya district)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. ఓ లారీ, ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటనలో రెండు వాహనాల డ్రైవర్లు అక్కడికక్కడే మృత్యువాత చెందారు. సంబేపల్లి మండలం శెట్టిపల్లి పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులతోపాటు మరో 12 మందికి గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాారిని రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ క్రమంలో వారిని మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితులు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వాసులుగా గుర్తించారు. అయితే ప్రొద్దుటూరు నుంచి ప్రైవేటు ట్రావెల్ బస్సు యాత్రికులతో రామేశ్వరం వెళ్తున్న క్రమంలో ఈ యాక్సిడెంట్ చోటుచేసుకుంది.