Lokesh On Chandrababu: ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Lokesh) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును హత్య చేసేందుకు అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఆధారాలు లేవని.. ఆ కేసులో అరెస్ట్ చేసి.. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
జెడ్ ప్లస్ భద్రత కలిగిన ప్రతిపక్ష నేతకు జైలులో హానీ తలపెట్టేలా జగన్ సర్కార్ కుట్ర చేస్తోందని నారా లోకేశ్ (Lokesh) ఆరోపించారు. జైలులో సరయిన భద్రత లేదని వివరించారు. ఇదే విషయం పదే పదే చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జైలులో పరిసరాల శుభ్రత సరిగా లేదని.. దోమలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుచేశారు. సరిగా నిద్రపట్టడం లేదని.. దోమల బెడద గురించి చెప్పినా.. ఏవో సాకులు చెప్పి.. బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో దోమల బెడదతో ఇటీవల ఓ రిమాండ్ ఖైదీ చనిపోయారని లోకేశ్ (Lokesh) తెలిపారు. రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటీ వీరవెంకట సత్యనారాయణ దోమలు కుట్టడంతో జ్వరం వచ్చిందని వివరించారు. సరైన సమయంలో చికిత్స అందించలేదని.. డెంగ్యూ జ్వరం వచ్చి.. చనిపోయారని గుర్తుచేశారు. సేమ్ అదేవిధంగా చంద్రబాబును కూడా చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. దోమలు ఉన్నాయని.. నివారణ చర్యలు తీసుకోవాలని చెబుతోన్న పట్టించుకోవడం లేదని వివరించారు.
అంటే కావాలని.. ఇలా చేస్తున్నారని లోకేశ్ (Lokesh) అన్నారు. దోమలు కుట్టి డెంగ్యూ జ్వరం బారిన పడేలా చేస్తున్నట్టు అనిపిస్తోందని మండిపడ్డారు. జైలులో చంద్రబాబుకు ఎలాంటి అపాయం కలిగిన అందుకు సీఎం జగన్ బాధ్యత వహించాలన్నారు.