»14 Tdp Members Were Suspended On The First Day Ap Assembly 2023
AP Assembly 2023: 15 మంది టీడీపీ సభ్యులు తొలిరోజు సస్పెండ్
ఈరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు సభలోనే నిరసనకు దిగడంతో ఏపీ స్పీకర్ 14 మంది టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు.
14 TDP members were suspended on the first day ap assembly 2023
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు నినాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య అసెంబ్లీ వాయిదా పడి, మళ్లీ తిరిగి సమావేశమైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో ప్రారంభమైన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమంటూ ప్లకార్డులు పట్టుకుని స్పీకర్ కుర్చీ వద్దకు కూడా చేరుకున్నారు. అరెస్టును ఖండిస్తూ వెంటనే విడుదల చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారిపై స్పీకర్ చర్యలు తీసుకన్నారు. ఆందోళన చేసిన 15 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు.
మరోవైపు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే ఎన్.బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పడం సరికాదని స్పీకర్ అన్నారు. సభా సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. ప్రజాసమస్యలపై చర్చించే వేదిక అని ఎమ్మెల్యేలు తమ వికృత ప్రవర్తనతో సభను అడ్డుకోలేరని స్పీకర్ వెల్లడించారు. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మొదటి సారి చేసిన తప్పుగా భావించి వదిలేస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకోవైపు బాలకృష్ణ మీసం తిప్పిన క్రమంలో మంత్రి అంబటి రాంబాబు బాలకృష్ణకు సవాల్ విసిరారు. సినిమాల్లో ఇలాంటి చేష్టలు చేయాలని, ఇక్కడ కాదని వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన పోడియంపై చుట్టుముట్టి, తప్పుడు కేసుల్లో శ్రీ నాయుడును ఇరికించారంటూ నినాదాలు చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది.