»Again Samantha Made Fools To Fans In Social Media
Samantha: సమంత మళ్లీ ఫూల్స్ ను చేసిందా!?
సమంత(samantha) ఏం చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో అమ్మడు జస్ట్ అలా ఏదైనా పోస్ట్ చేస్తే.. క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. అయితే ఈ బోల్డ్ బ్యూటీ చేసే పోస్ట్‌లు అప్పుడప్పుడు షాక్ ఇచ్చేలా ఉంటున్నాయి. యశోద సినిమా రిలీజ్ సమయంలో సమంత చేసిన ట్వీట్ మాత్రం.. ఇప్పటికీ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తునే ఉంది. ఇప్పుడు మరోసారి అలాంటి పోస్ట్ చేసి షాక్ ఇచ్చి.. ఫూల్స్ చేసినట్టే ఉంది వ్యవహారం.
సమంత(Samantha) మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పడుతున్నానని చెప్పడమే కాదు. ఇంటర్య్వూలో నేనింకా చావలేదని కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇదే ఫార్ములాను రీసెంట్గా వచ్చిన శాకుంతలం సినిమా టైంలోను అప్లై చేసింది. కానీ సినిమా తేడా కొట్టేసింది. దాంతో ఆ వెంటనే నార్మల్ మోడ్‌లోకి వచ్చేసింది. అందుకే.. ఇప్పటి వరకు అమ్మడు హెల్త్ గురించి చెప్పింది నిజమా? అబద్దమా? అనే డైలామాలో ఉన్నారు నెటిజన్స్.
అయితే ఇప్పుడు మరో షాక్ ఇచ్చింది సామ్. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సమంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫొటో చూసి.. ఆమె ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం తాను హైపర్ బారిక్ అనే ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఇది గ్రోత్ ఫ్యాక్టర్లు, స్టెమ్ సెల్స్ విడుదలకు ప్రేరేపిస్తుందని అంటున్నారు. దీంతో సమంత ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేజ్ చేస్తోందా? అనే సందేహాలు వస్తున్నాయి.
కానీ ఈ ఫోటోలు షేర్ చేసిన కొద్ది సేపటికే మరో పోస్ట్ చేసింది. అది ఓ కమర్షియల్ యాడ్‌కు సంబంధించింది కావడం విశేషం. ప్రముఖ బ్రాండ్ పెప్సీకి సంబంధించిన యాడ్‌ను షేర్ చేసింది. దీంతో ఈ యాడ్ కోసమే.. సమంత అందరి అటెన్షన్ ఒక్కసారిగా తన పై ఉండేలా.. ఆక్సిజన్ బెడ్ పై ఉన్న ఫోటోని షేర్ చేసిందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే సమంతకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎలాంటి ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేసిన సరే.. కొన్ని కోట్లు సమర్పించాల్సిందే. ఈ క్రమంలోనే పెప్సీ యాడ్‌ను ప్రమోట్ చేయడానికి.. సమంత అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుందా? అనే డౌట్స్ వస్తున్నాయి.
ఎందుకంటే శాకుంతలం విషయంలో అమ్మడు ఇలాగే చేసిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఇదే నిజమైతే.. అమ్మడు మళ్లీ అందరినీ ఫూల్స్(fools) చేసినట్టే. సామ్ మున్ముందు కూడా ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తే.. నమ్మడం కష్టమే. మరి సమంతకు ఉన్న అసలైన హెల్త్ ఇష్యూ ఆమెకే తెలియాలి.