HYDలో ఎండలు మండి పోతున్నాయి. TGDPS నివేదిక ప్రకారం.. నేడు హిమాయత్‌నగర్‌లో 38.3°C, ఉప్పల్ న్యూ నాగోల్‌లో 38.2°C గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అంబర్పేట్, ముషీరాబాద్, అల్వాల్ ప్రాంతాల్లో 38.1°C చేరింది. స్వల్ప వర్షపాతం నమోదైనా వేడి తగ్గలేదు. ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.