»Bansuwada Sabha The Pink Boss Kcr Who Is On Fire Against The Congress
CM KCR: దద్దరిల్లిన బాస్సువాడ సభ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన గులాబీ బాస్
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నాయి. తాజాగా నేడు బాన్సువాడలో సీఎం కేసీఆర్ సభను నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు.
Pension Will Also Be Given To Those Who Do New Beedis: KCR
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సు వాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించింది. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కడుపు, నోరు కట్టుకుని 24 ఏళ్ల కిందట ఉద్యమాన్ని ప్రారంభించామని, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని కేసీఆర్ అన్నారు. సమైక్య పాలకులు నిజాంసాగర్‌ను సర్వ నాశనం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏదో చేశానని విర్రవీగుతోందని, రాష్ట్రాన్ని ఎంతో కష్టపడి సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే సర్వనాశనం కావడం ఖాయమని సీఎం కేసీఆర్ అన్నారు.
నిజాం సాగర్‌కు నీళ్లు వచ్చేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి ధర్నాలు చేశారని గుర్తు చేశారు. పంటలను కాపాడేందుకు ఆనాడు ఆందోళన చేసిన పరిస్థితులు ఉండేవన్నారు. నిజాంసాగర్ 365 రోజులూ నిండి ఉంటుందని ప్రజల సమక్షంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. శ్రీనివాస్ రెడ్డి నాయకుడినని అనుకోడని, స్పీకర్ పదవిలో ఉన్నాననే రుబాబు ఆయనకు లేదన్నారు. జాకోరా, చందూరు లిఫ్ట్‌లు, సిద్దేశ్వరం రిజర్వాయర్లను పోచారం కట్టిస్తున్నారని, ప్రజలను కాపాడుకోవాలని ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నారన్నారు.
తన నియోజకవర్గంలో కంటే పోచారం నియోజకవర్గం అయిన బాన్సువాడలో ఎక్కువగా 11 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారన్నారు. మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరోవైపు మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరగడంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆయనపై దాడి తనపై దాడిగానే భావిస్తానని అన్నారు. ప్రజల మంచి కోసం ముందుకు వెళ్తున్నామని, సమస్యలపై యుద్ధం చేస్తున్నామని, శత్రువులను ఏ ఇబ్బంది పెట్టలేదని, అయినప్పటికీ తమ నాయకులపై దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బాస్సువాడ ప్రజలంతా పోచారం శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు.