కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దళిత మహిళను వివాహం చేసుకున్నందుకు భార్యభర్తలను ఇద్దరిని వివస్త్రలను చేసి చెట్టుకు కట్టేసి చావబాదారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది.
In Kamareddy district, a Dalit woman was stripped, tied to a pole
Dalit woman: దళిత మహిళలతో సహజీవనం చేసి విహహం చేసుకున్నందకు భార్యభర్తలను ఇద్దరిని నగ్నంగా చేసి, కళ్లల్లో కారంత కొట్టి చావబాదారు. దీన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మాములుగా ఇలాంటి ఘటనలు ఉత్తరాది రాష్ట్రాల్లో జరుగుతుంటాయి. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అక్కాపూర్ గ్రామానికి చెందిన నందాని నరేశ్ ముదిరాజ్‌కు మూడేళ్ల క్రితం సంధ్యతో వివాహం అయింది. వీరికి ఏడాది వయసున్న ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత యువతితో నరేష్‌కు పరిచయం ఏర్పడింది. భర్తకు దూరం ఉంటున్న ఆమెతో నరేష్‌కు వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం తెలుసుకున్న సంధ్య గ్రామ పెద్దమనుషులతో మందలించింది. దాంతో నరేష్ ఆమెను రెండో వివాహం చేసుకొని ఇసన్నపల్లిలో ఆమెతో కాపురం పెట్టాడు. విషయం తెలిసిన సంధ్య, ఆమె కుటుంబ సభ్యులు ఈ నెల 4న గ్రామంలోని ఆమె ఇంటికి వెళ్లి ఇద్దరినీ పట్టుకుని నగ్నంగా మార్చి కళ్లలో కారం కొట్టి దాడిచేశారు. ఆ తర్వాత ఇద్దరినీ అక్కాపూర్ తీసుకొచ్చి విద్యుత్ స్తంభానికి కట్టేసి చావబాదుతూ హింసించారు.
దీన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వారిని విడిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధూశర్మ తీవ్రంగా పరిగణించారు. విచారణ చేపట్టాలని ఆదేశించారు. దాడికి పాల్పడిన నరేశ్ భార్య సంధ్య, మరో ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.