»Question Paper Leakage Case Revanth Reddy Fire On Kt Rama Rao
TSPSC Paper Leakage చేసిందంతా మంత్రి కేటీఆర్ పీఏనే: రేవంత్ రెడ్డి
లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి.
తెలంగాణలో పోటీ పరీక్షల (Competative Exams) ప్రశ్నాపత్రాల లీకేజీ (Leakage) రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. ఎన్నికల (Elections) ముంగిట ఈ లీకేజ్ వ్యవహారం వెలుగు చూడడం అధికార పార్టీకి మింగుడు పడని విషయం. ఈ లీకేజ్ సంఘటన బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మెడకు చుట్టుకుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల ప్రకటన విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి పశ్నాపత్రాల లీక్ తో చెడ్డపేరు వచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వంలో సీనియర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) పైనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆయన పేషీ నేతృత్వంలోనే లీకేజ్ లు జరిగాయని ప్రతిపక్షాలు (Opposition Parties) విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీపీసీసీ (TPCC) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశాడు. మంత్రి పేషీ నుంచే లీకేజ్ వ్యవహారం నడించిందని, మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి (PA)నే ప్రధాన సూత్రధారి అంటూ ఆరోపణలు చేశాడు. కామారెడ్డి జిల్లా (Kamareddy District) గాంధారి (Gandhari)లో ఆదివారం చేపట్టిన నిరుద్యోగ నిరసనలో రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.
‘లీకేజ్ వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని విచారణ చేయకముందే మంత్రి కేటీఆర్ వారిద్దరే నిందితులు అని ఎలా చెబుతారు’ అంటూ రేవంత్ ప్రశ్నించాడు. కేటీఆర్ పీఏ తిరుపతి షాడో మంత్రి అని కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి ద్వారానే అన్ని వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. టీఎస్పీఎస్సీ (TSPSC)లో కీలక బాధ్యతలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి అప్పగించడంలోనే అసలు రహాస్యం దాగి ఉందని తెలిపాడు. ‘చంచల్ గూడ జైలులో ఇద్దరు నిందితులను కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. వాళ్లు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయి. అందుకే రాజశేఖర్, ప్రవీణ్ లను జైల్లో బెదిరించారు. లీకేజ్ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతికి స్నేహితుడు. ఆ పరిచయంతోనే 2017లో రాజశేఖర్ ను తిరుపతి టీఎస్ పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. మొత్తం లీకేజ్ వ్యవహారానికి కారణం మంత్రి పీఏనే’ అంటూ రేవంత్ ఆరోపించాడు.
‘లీకేజీ వ్యవహారంపై ఏర్పాటు చేసిన సిట్ అధికారి శ్రీనివాస్ కేటీఆర్ బావమరిదికి స్నేహితుడు. దీంతోనే అర్థమవుతోందని కేసు ఎటు వెళ్తుందో. నిజనిజాలు తేలాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. ఇదే విషయమై తాము మంగళవారం గవర్నర్ (Governor) తమిళిసైని కలిసి విన్నవిస్తాం. నిరుద్యోగులకు న్యాయం చేయాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశాడు.