»In The Hands Of Cyber Criminals Rs Khammam Young Woman Looting 91 Thousand
Cybercrime: సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కిన యువతి.. పెద్ద మొత్తంలో స్వాహా
సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోం, లక్కీ కూపన్ పేరిట లింక్స్ సెండ్ చేయడం అమాయకులకు ఆశజూపి లూటీ చేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా ఓ యువతి ఇలానే లింక్ ఓపెన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంది.
In the hands of cyber criminals Rs. Khammam young woman looting 91 thousand
Cybercrime: ఇన్స్టాగ్రామ్ లింక్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న యువతి గురువారం సైబర్ క్రైమ్‌లో కేసు నమోదు చేసింది. ఖమ్మం జిల్లా ఇల్లందు మండలంలోని నిజాంపేటకు చెందిన పత్తి నవ్వశ్రీ బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం జాబ్స్ కోసం ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోం అనే ఓ లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి ప్రాసెస్ పూర్తి చేసింది. అందులో మనీ పంపితే అంతకంటే ఎక్కువ వస్తాయని డబ్బులు పంపించడం మొదలు పెట్టింది. అలా రూ. 91 వేల వరకు దశల వారిగా పంపింది. అనుమానం వచ్చని నవ్వశ్రీ తన డబ్బు తనకు తిరిగి పంపవలసిందిగా కోరింది. మరో రూ. 83 వేలు పంపితే మీ అన్ని డబ్బులు ఒకే సారి తిరిగి వస్తాయని రిప్లై వచ్చింది. దీంతో తాను మోసపోయినట్లు గమనించిన నవ్వశ్రీ వెంటనే సైబర్ క్రైమ్ 1930కి ఫోన్ చేసి వివరాలు తెలిపింది. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
రోజురోజుకు ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయని, వీటి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ తెలిపారు. అనుకోని విధంగా ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కాల్ చేయండి, లేదంటే దగ్గర్లోని పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అని వెల్లడించారు. ఇక నవ్వ కేసులో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సైబర్ నెట్ వర్క్ వారు ఏదైతే లింక్ ద్వారా డబ్బు ట్రాన్స్ ఫర్ అయిందో, దాని నేరగాళ్ల బ్యాంక్‌ను ట్రాన్స్క్షన్ హోల్డ్‌లో పెడుతారు. ఆ తరువాత తదుపరి దర్యాప్తు సాగుతుంది అని ఎస్ఐ వెల్లడించారు.