»A Young Woman Who Lost Her Life While Doing Reels In Maharashtra While Reversing The Car
Sulibhanjan Hills: రీల్స్ చేస్తూ.. కారు రివర్స్ చేస్తూ.. ప్రాణాలు కోల్సోయిన యువతి
డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ యువతి కారు రివర్స్ చేయబోయి లోయలో పడింది. అదే సమయంలో తన ఫ్రెండ్ ఫోన్లో రీల్స్ చేస్తూ.. క్లచ్ క్లచ్ అని అరుస్తున్నా వినిపించికోని యువతి అలాగే స్పీడ్‌గా వెనక్కి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
A young woman who lost her life while doing reels in Maharashtra.. while reversing the car.
Sulibhanjan Hills: మహారాష్ట్రలో ఓ అమ్మాయి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు వెళ్లి ప్రాణాలను కోల్పోయింది. ఈ దారుణ ఘటన మంగళవారం మధ్యాహ్నం సమయంలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌లోని సులీబంజన్ హిల్స్(Sulibhanjan Hills)పై నుంచి కారు కింద లోయలో పడింది. కారు రివర్స్ చేస్తున్న సమయంలో కారు అదుపు తప్పడంతో ఈ దారుణ సంఘటన జరిగింది. 23 ఏళ్ల శ్వేతా దీపక్ సుర్వేజ్ తన స్నేహితుడు సూర్ సంజూ మూలే(25)తో కలిసి కారు నేర్చుకోవడానికి సులీబంజన్ హిల్స్‌కు వెళ్లింది. ఆ సమయంలో తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా తాను కారు డ్రైవింగ్ చేస్తుంది. నెమ్మదిగా రివర్స్ తీయమని తన ఫ్రెండ్ చెబుతుండగా తాను కారు డ్రైవ్ చేస్తుంది. కారు వెనక్కి వెళ్లే కొద్ది వేగం పెరుగుతుండడంతో స్నేహితుడు అలా కాదు అని అరుస్తున్నాడు.
దీనికి సంబంధించిన వీడియోను స్వయంగా సంజూ తీస్తూ క్లచ్, క్లచ్ అని అరుస్తున్నాడు. కానీ కన్ఫ్యూజ్ అయిన శ్వేతా యాక్సీలేటర్ నొక్కిపట్టింది. దాంతో కారు ఇంకా వేగంగా వెనక్కి వెళ్లింది. సంజూ కూడా తనన ఆపడానికి పరుగెత్తుకుంటూ వెళ్లాడు కానీ ఆలోపే కారు లోయలో పడిపోయింది. సుమారు 300 ఫీట్ల లోతు ఉన్న ఆ లోయలో కారు పడింది. కొండపైన ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినట్లు, దర్శనం అనంతరం వారు కిందికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సంజూ పేర్కొన్నారు.