»Star Singer Alka Yagnik Lost His Hearing Due To A Rare Problem
Alka Yagnik: అరుదైన సమస్యతో వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్
న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన వ్యాదితో తన వినికిడి శక్తిని కోల్పోయిన స్టార్ సింగర్ అల్కా యాగ్నిక్. అల్కా యాగ్నిక్ హిందీ సినిమాలో పాడే ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరియర్లో 8000 పాటల పైగా ఆలపించారు.
Star singer Alka Yagnik lost his hearing due to a rare problem
Alka Yagnik: న్యూరల్ నెర్వ్ సెన్సోరీ లాస్ అనే అరుదైన వ్యాదితో తన వినికిడి శక్తిని కోల్పోయిన స్టార్ సింగర్ అల్కా యాగ్నిక్. అల్కా యాగ్నిక్ హిందీ సినిమాలో పాడే ప్రముఖ నేపథ్య గాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె కెరియర్లో 8000 పాటల పైగా ఆలపించారు. ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. కొన్ని వారాల క్రితం విమానం నుంచి బయటకు రాగానే ఆకస్మాత్తుగా వినికిడి కోల్పోయినట్లు తాను పేర్కొన్నారు. ఈ కారణంతోనే తాను పాటలు కూడా పాడడం మానేసినట్లు వెల్లడించారు. లౌడ్ మ్యూజిక్, హెడ్‌ఫోన్స్ ఎక్కువగా ఉపయోగించొద్దని సలహా ఇచ్చారు. హిందీ, తెలుగు సహా 25 భాషాల్లో అనేక పాటలు పాడారు.
ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా రికార్డు స్థాయిలో ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డులతో పాటు జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్నారు. గుజరాతీ కుటుంబంలో జన్మించిన అల్కా యాగ్నిక్ ఆమె తల్లి శుభ ఓ భారతీయ శాస్త్రీయ సంగీత గాయని. అల్కా యాగ్నిక్ 1972లో ఆరేళ్ల వయసులో తను పాడడం మొదలుపెట్టింది. ఆ సమయంలో కలకత్తాలోని ఆకాశవాణిలో పాడుతుండేది. 10 సంవత్సరాల వయస్సులో, ఆమె తల్లి ముంబై తీసుకురావడంతో తన పాట జీవితం ప్రారంభమయింది.