ram charan : ఆ సినిమా హిట్ అయ్యాక వారం రోజులు ఎంజాయ్ చేశానన్న చరణ్
సినిమా ఫలితాల గురించి తాను ఎక్కువగా అంచనాలు వేసి ఆలోచించనని రామ్ చరణ్ అన్నారు. తనకు అప్పగించిన పనికి వంద శాతం న్యాయం చేశానా? లేదా? అనేది మాత్రమే చూస్తానని తెలిపారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ram charan : మెగాస్టార్ తనయుడిగానే కాకుండా, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan). ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్(rrr) సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తాను వారం రోజుల పాటు ఇంటి నుంచి బయటకు రాలేదని చెప్పారు. ఇంట్లోనే కుటుంబంతో ఫుల్గా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టేందుకు ఏమైనా ఒత్తిడికి గురవుతారా? అని అడగ్గా అలాంటిది ఏమీ లేదని అన్నారు. వారసత్వం గురించి తాను ఎక్కువగా ఆలోచించనని అన్నారు.
తాను సినిమా చేసేంత వరకు దాన్ని ఎంతబాగా చెయ్యాలనే విషయం పై ఎక్కువగా ఆలోచిస్తానని, ఆ తర్వాత సినిమా ఫలితాల గురించి ఎక్కువగా ఆలోచించనని చెప్పారు. ఒత్తిడిని ఎలా తీసుకోవాలో తనకు తెలియదని రామ్ చరణ్ అన్నారు. సినిమా అనుకున్నంత హిట్ కాకపోతే కూడా రిలాక్స్ అవడానికి తాను పార్టీ చేసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని మీద మాత్రమే దృష్టి పెట్టి చేస్తానని అన్నారు.
ప్రస్తుతం గేమ్ ఛేంజర్(game changer) మూవీతో బిజీ బిజీగా ఉన్నారు రామ్ చరణ్. దాని షూటింగ్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు సైతం అంతే ఎక్కువగా ఉన్నాయి. దీనిలో కియారా అడ్వాణీ హీరోయిన్గా నటిస్తున్నారు. 2024లోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.