»Ts Minister Ktr Counter To Bjp Oscar Award Given Because Of Modi
Oscar అవార్డు కూడా మోడీ ఇచ్చాడు.. మంత్రి కేటీఆర్ ఎద్దేవా
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది అకాడమీ నిర్వాహకులు కాదు.. ప్రధాని మోదీ వలనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది అని చెబుతారు’ అంటూ బీజేపీ నాయకులను చెబుతారని తన ట్వీట్ ద్వారా చెప్పారు.
ఆస్కార్ అవార్డు దక్కడంతో యావత్ భారతదేశం గర్విస్తోంది.. ఉప్పొంగిపోతున్నది. ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా తెలంగాణలో మాత్రం రాజకీయంగా వైరల్ గా మారింది. గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఇక అవార్డు రావడానికి కారణం ప్రధాని మోదీ అంటూ తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దేవా చేశారు. అంతకుముందు చిత్రబృందానికి అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్.. అనంతరం మరో ట్వీట్ లో బీజేపీ నాయకులను ఉద్దేశించి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ‘ఇంకేముంది.. మోదీ కారణంగా అవార్డు వచ్చిందని చెబుతారు’ అంటూ నవ్వే ఎమోజీ పెట్టి పోస్టు చేశారు.
మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎందుకంటే బీజేపీ నాయకులు ప్రతి విషయాన్ని నరేంద్ర మోదీ ఘనత చెప్పుకుంటున్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని మోదీ ఆపాడని, కరోనా వ్యాక్సిన్స్ ఆయన కనిపెట్టాడని గతంలో బీజేపీ సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులతో పాటు మన కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు చెప్పారు. ఆ వ్యాఖ్యలను గుర్తు చేసేలా మంత్రి కేటీఆర్ ట్వీట్ ఉంది. ఇప్పుడు కూడా ‘ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది అకాడమీ నిర్వాహకులు కాదు.. ప్రధాని మోదీ వలనే ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది అని చెబుతారు’ అంటూ బీజేపీ నాయకులను చెబుతారని తన ట్వీట్ ద్వారా చెప్పారు. ఆ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
కాగా ఆర్ఆర్ఆర్ సినిమాపై గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. సినిమా బృందాన్ని అడ్డుకుంటామని, సినిమా ప్రదర్శించే థియేటర్ లపై దాడులు చేస్తామని గతంలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమురం భీం తలపై తెల్లటోపీ పెట్టుకోవడాన్ని సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా ప్రతి విషయాన్ని హిందూ ముస్లింల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని అప్పుడే సంజయ్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డు రావడంతో ప్రస్తుతం సంజయ్ వ్యాఖ్యలు చర్చకు వచ్చాయి.
తెలంగాణ పోరడు రాహుల్ సిప్లిగంజ్ పై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ లోని పాతబస్తీకి చెందిన రాహుల్ ఏకంగా ఆస్కార్ అవార్డును తొలిసారి భారతదేశానికి అందించడం గర్వకారణంగా నిలిచిందని హైదరాబాద్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆల్బమ్స్ చేసుకుంటూ వెళ్తున్న రాహుల్ కు తొలి సినిమా నాగచైతన్య నటించిన జోష్. అందులో తొలి పాట పాడిన రాహుల్ అప్పటి నుంచి నేటి ఆస్కార్ వరకు చేరాడు.