Fire in the drug rehabilitation centre in iran 32 people died 16 people were injured
సికింద్రాబాద్ బోయిన్పల్లి(Boinpally)లో విషాదం జరిగింది. ఇద్దరు కూతుళ్లను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. స్థానిక భవానీనగర్లో ఉండే శ్రీకాంత్ చారి (Srikanth Chari) కూతుళ్ల స్రవంతి (8), శ్రావ్య (7)ను చంపి తాను సూసైడ్ (Suicide) చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో క్షణాకావేశంలో శ్రీకాంత్ తన కూతుళ్ల(Daughters)కు నిద్రమాత్రలు ఇచ్చి, తాను మింగి చనిపోయాడు. ఆత్మహత్యకు గల కారణలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. శ్రీకాంత్ ఇలా ఎందుకు చేశాడు? తాను చనిపోవాలనుకున్నాడు సరే, పిల్లల్ని ఎందుకు చంపాడు? తల్లి ఎక్కడుంది? ఇంతటి విషాదానికి కారణమేంటి? ఇవన్నీ ప్రశ్నలుగానే ఉన్నాయి. పోలీసులు (Police) కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.