»Best Original Song Award For Rrr Natu Natu Song Which Won Oscar 2023
Oscar 2023: RRRకు ఆస్కార్…నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డు
95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.
ప్రస్తుతం ప్రపంచమంతా మన సినిమా ఆర్ఆర్ఆర్ గురించే చర్చించుకుంటోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా.. తాజాగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. 95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో ‘RRR’లోని ‘నాటు నాటు’ ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. కీరవాణి, చంద్రబోస్ గారు అవార్డును స్వీకరించారు. ఈ పాట “భారతదేశానికి గర్వకారణం” అని అభివర్ణించారు. ఆస్కార్ ప్రేక్షకులను “నమస్తే” అని పలకరించారు.
దీంతో దేశంతోపాటు ఈ కేటగిరిలో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్(RRR MOVIE) రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్, చంద్రబోస్ సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు సమకూర్చారు. ఈ పాట మార్చి 2022లో విడుదలైన వెంటనే ఎక్కువగా ప్రజాధారణ పొందింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్ విడుదలతోపాటు OTT ప్లాట్‌ఫారమ్‌లలో కూడా రికార్డు క్రియేట్ చేసింది.
ఇప్పటికే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. దానితో పాటు జపాన్ లో జరిగిన 46 వ అకాడమీ అవార్డ్స్ లోనూ అవుట్ స్టాండింగ్ ఫారెన్ మూవీ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవార్డును దక్కించుకుంది. ఈ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ అవతార్ 2 సినిమాను, టాప్ గన్ సినిమాను వెనక్కి నెట్టింది. ఆస్కార్ అవార్డులను లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రదానం చేశారు.
మరోవైపు ఆస్కార్ నామినేషన్స్ రేసులో నిలిచిన కాంతారా సినిమాకు నామినేషన్స్ లో చోటు దక్కలేదు. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం కేటగిరీలో ఈ సినిమా నామినేషన్స్ రేసులో నిలిచింది. ఆస్కార్ 95 ఒరిజినల్ సాంగ్ నామినీల్లో నాటు నాటు సాంగ్ సెలెక్ట్ అయింది. ఈ కేటగిరీలో నాటు నాటు పాటతో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమన్ అనే సినిమా నుంచి అప్లాజ్ అనే పాట, టాప్ గన్ మావెరిక్ సినిమా నుంచి హోల్డ్ మై హాండ్, బ్లాక్ పాంథర్, వకండా ఫరెవర్ సినిమా నుంచి లిఫ్ట్ మీ అప్, ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ అనే సినిమా నుంచి దిస్ ఈజ్ ఏ లైఫ్ అనే పాటలు నామినేషన్స్ బరిలో నిలిచాయి.
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మరియు అతిపెద్ద అవార్డు వేడుక ఆస్కార్. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్ డిజైన్, మేకప్, హెయిర్‌స్టైలింగ్ మరియు మరిన్ని వంటి 24 విభాగాలలో అత్యుత్తమ అవార్డులను అందజేస్తాయి. SS రాజమౌళి యొక్క బ్లాక్ బస్టర్ “RRR”లోని హిట్ డ్యాన్స్ ట్రాక్ “నాటు నాటు”తో ఈ సంవత్సరం ఆస్కార్స్‌లో భారతదేశం బలమైన ఉనికిని కలిగి ఉంది.