కృష్ణా: మచిలీపట్నం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో DMHO యుగంధర్ హెల్త్ ప్రోగ్రాం గురించి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య కార్యక్రమాలు గురించి సమీక్షించి, వాటి అమలు తీరు గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు. 14 నుంచి 15 వయసు గల బాలికలు హెచ్ పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు.