»Ap Brs Chief Thota On Kcr Rs 1000 Crores Offer To Pawan Kalyan
KCR offer to Pawan Kalyan: పవన్‌కు రూ.1000 కోట్ల ఆఫర్‌పై తోట
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేసీఆర్ రూ.1000 కోట్లు ఆఫర్ చేశారనే ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత తోట చంద్రశేఖర్ ఖండించారు. పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు.
జనసేన (JanaSena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పైన ఇటీవల ఓ మీడియా షాకింగ్ ఆరోపణలు చేసింది. ఏపీ రాజకీయాల్లో మరోసారి వైసీపీ అధినేత జగన్ ను (YS Jagan) గెలిపించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) ప్రయత్నాలు చేస్తున్నారని, ఇందులో భాగంగా జనసేనానికి 1000 కోట్ల రూపాయల ఆఫర్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికే జగన్ పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, కాబట్టి జనసేన దోస్తీతో చంద్రబాబుకు లబ్ధి చేకూరుతుందని భావించిన కేసీఆర్, వీరిద్దరిని దూరం చేసే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు. వీరిద్దరిన వేర్వేరుగా పోటీ చేయించాలనే టార్గెట్‌తో భారీ ఆఫర్ చేశారని, అలా కానీ పక్షంలో పొత్తుతో ముందుకు సాగితే కచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని అడగాలని బీఆర్ఎస్ అధినేత తన సన్నిహితుల ద్వారా జనసేనానికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఈ వార్త ఉద్దేశ్యం. అయితే ఈ ఆరోపణలను ఆంధ్ర ప్రదేశ్ బీఆర్ఎస్ అధినేత (Andhra Pradesh BRS president) తోట చంద్రశేఖర్ (thota chandrasekhar) ఖండించారు. ఆయన బుధవారం ఉండవల్లి దేవుని మాన్యంలో మహా మృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కు రూ.1000 కోట్ల ఆఫర్, జనసేనతో పొత్తు తదితర అంశాలపై మాట్లాడారు.
పవన్ కళ్యాన్ కు (Pawan Kalyan) తమ పార్టీ అధినేత (KCR) 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారని చెప్పడంలో ఎలాంటి వాస్తవం లేదని, అసలు అలా చెబుతున్న వారి దిగజారుడుతనానికి ఇది అద్దం పడుతుందన్నారు. ఇలాంటి ఆరోపణలను తాము తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెద్ద పార్టీల నేతలను అవహేళన చేసే అభియోగాలు మోపటం ఏమాత్రం సరికాదన్నారు. జనసేనతో పొత్తుపై మాట్లాడూతూ…. పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చునని చెప్పారు. పొత్తులు మేం పెట్టుకుంటే సంసారం.. ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్లుగా ఎవరైనా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు. పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారనే అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుందన్నారు.
అదే సమయంలో ఏపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు ఏళ్ళుగా ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఒక రాజధాని, మూడు రాజధానులు అంటూ చెప్పడమే సరిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్ తో ముందుకు సాగుతామన్నారు. తమ పార్టీ అధికారంలోకు వస్తే మూడు, నాలుగేళ్లలో రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంటు, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం విమానాశ్రయం తదితర విభజన చట్టంలోని హామీలన్నింటిని పూర్తి చేస్తామన్నారు.
దేశంలోను రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదన్నారు. ముఖ్యమైన రైతాంగ సమస్యలపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ అన్ని రాష్ట్రాలలోను విస్తరిస్తుందన్నారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగం, ధరల నియంత్రణ లేకపోవడం ప్రధాన సమస్యలు ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధిస్తామన్నారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను సాధించడంలో గతంలో తెలుగు దేశం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అన్నారు.