‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్రైలర్ టెర్రిఫిక్‌గా ఉందంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ‘ఆద్యంతం అద్భుతమైన ఉత్సాహం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా, పూర్తి స్వాగ్తో కనిపిస్తున్నారు. హరీష్ శంకర్ ఆయన్ని ఎలా ప్రజెంట్ చేయాలో కచ్చితంగా తెలిసిన వ్యక్తి. ‘ఉస్తాద్’తో ఉగాది పండుగను జరుపుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చాడు.