AP: తిరుపతి పట్టణ శివారు ఆటోనగర్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ షాప్ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన ప్రదేశంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ క్రమంలో దట్టమైన పొగ అలముకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.