CTR: పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుని రూపంలో కల్పవృక్ష వాహనంపై అధిరోహించి భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. పురవీధుల్లో ఊరేగుత
AP: రాష్ట్ర నూతన సీఎస్‌గా జి సాయి ప్రసాద్ రేపు ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత CS విజయానంద్ పదవీ కాలం ముగుస్తుండడంతో తదుపరి సీఎస్‌గా సాయిప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన జలవనరుల
TG: ఖమ్మం మంత్రుల తీరు దారుణంగా ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. పేదల ఇళ్లు కూలగొట్టి కబ్జా చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టాల్సింది పోయి.. కూల్చడంలో పోటీ పడతారా? అని నిలదీశారు. పేదల ఇళ్లు కూల్చితే.. ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చ
ఏలూరు వి.వి.నగర్ వద్ద మార్కెట్ యార్డు హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ప్రదర్శన జరిపారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలైనా అం
NGKL: అచ్చంపేట పట్టణంలో ఈరోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం లింగాల చౌరస్తాలో అడ్డా కూలీలతో మాట్లాడుతూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టాండ్ సమీపంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బ్రిడ
NLR: ఉదయగిరి మేజర్ పంచాయతీలో ఇంటి పన్నులు చెల్లించని వారిపై శాఖా పరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో ఎస్.మోహన్ రావు తెలిపారు. పట్టణంలోని ఇంటి యజమానులు పంచాయతీ అధికారులకు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలని సూచించారు. పన్ను
JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో ఉన్న శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో ఫాల్గుణ మాస శుక్ల పక్ష శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాతలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. అ
MNCL: గ్రామాల అభివృద్ధి వార్డు సభ్యుల చేతుల్లోనే ఉందని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ అన్నారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం శుక్రవారం కొనస
E.G: రంగంపేటలో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాచీన శివాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. MLA నల్లమిల్లి సహకారంతో రూ.1.50 కోట్ల నిధులు మంజూరైనట్లు సర్పంచ్ బలిరెడ్డి లక్ష్మీ దుర్గారావు తెలిపారు. అధికారులు, కూటమి నేతలు, భక్తుల సహకారంతో పనులు వేగంగా సాగు
మొటిమల సమస్యతో బాధపడేవారు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, ఆకుకూరలు, వాల్నట్స్, ఆలివ్ నూనె, బీన్స్, గుడ్లు, అవిసె గింజలు వంటివి తీసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, కొబ్బరి