• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘చందనోత్సవానికి ప‌టిష్ట భ‌ద్ర‌త‌’

VSP: చందనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన‌ట్టు సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చి తెలిపారు. మొత్తం 2,800 మంది సిబ్బందిని రంగంలోకి దించి, కొండపై , దిగువ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు తమ వాహనాలను కొండ దిగువనే పార్క్ చేసి, దేవస్థానం బస్సుల ద్వారానే పైకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

April 19, 2026 / 06:39 AM IST

అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పురోగతిపై కలెక్టర్ సమీక్ష

VZM: జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం కలక్టరేట్లో పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై అదికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్‌ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌ దీపాల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

April 19, 2026 / 06:35 AM IST

అనారోగ్యంతో అంగన్వాడీ కార్యకర్త మృతి

NDL: చాగలమర్రిలోని బుగ్గరస్తాలో గల 5వ కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్న పద్మావతి (60) అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న మండలంలోని పలువురు అంగన్వాడీ టీచర్లు శనివారం ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐసీడీఎస్ సీడీపీవో తేజేశ్వరి, సూపర్వైజర్ సుశీల వారి కుటుంబసభ్యులకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

April 19, 2026 / 06:30 AM IST

సూసైడ్‌కు యత్నం.. అడ్డుకున్న పోలీసులు

ప్రకాశం: జిల్లాలో బీటెక్ విద్యార్థి శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. పొదిలి మండలం గోగినేనివారిపాలెంకు చెందిన ఈ యువకుడు, అంతకుముందు తన తమ్ముడికి ఫోన్ చేసి ‘నేను చనిపోతున్నాను’ అని చెప్పాడు. ఆందోళన చెందిన తమ్ముడు వెంటనే చీమకుర్తి పోలీసులను ఆశ్రయించాడు. స్పందించిన చీమకుర్తి సీఐ, ఎస్సై ఫోన్ సిగ్నల్ ఆధారంగా గాలించి, విద్యార్థి ప్రాణాలను కాపాడి అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

April 19, 2026 / 06:30 AM IST

గడ్డివాములు దగ్ధం

KRNL: గోనెగండ్లలోని బీసీ కాలనీలో శనివారం ప్రమాదవశాత్తు నిప్పుఅంటుకొని 2 గడ్డివాములు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.75వేల నష్టం వాటిల్లినట్లు బాధిత మహిళా రైతు బోయ లక్ష్మి తెలిపారు. గడ్డివాము పై బాగంలో విద్యుత్ తీగలు ఉన్నాయి. తీగల నుంచి నిప్పరవ్వలు గడ్డి వాములపై పడటంతో వాములు రెండు కాలిపోయాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.

April 19, 2026 / 06:30 AM IST

H1V నివారణ జిల్లాగా తీర్చిదిద్దుదాం: DMHO

NLR: జిల్లాలో బీవీనగర్ లోని DFIT కార్యాలయంలో H1V/ఎయిడ్స్ పై DMHO వి.సుజాత, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. H1V నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కేసులను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.

April 19, 2026 / 06:27 AM IST

కలెక్టర్ నేరుగా ప్రజలకు ఫోన్.. ఎందుకంటే!

ELR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన దరఖాస్తుల స్థితిగతులపై జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి శనివారం అర్జీదారులకు నేరుగా ఫోన్ చేసి ఆరా తీశారు. సమస్యలు పరిష్కారమయ్యాయని బాధితులు కలెక్టర్‌కు వివరించారు. దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.

April 19, 2026 / 06:21 AM IST

పూర్తి ఆధారాలతో హాజరు కావాలి: కలెక్టర్

WG: జిల్లాలో 22-ఏ భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రైతులు పూర్తి ఆధారాలతో విచారణకు హాజరుకావాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ విచారణలో ఆమె మాట్లాడారు. భూ వివాదాల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను వేగంగా పరిశీలించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు.

April 19, 2026 / 06:19 AM IST

‘రాత్రి వేళల్లో గస్తీ ముమ్మరం చేయాలి’

SKLM: జిల్లాలో నేర నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి రాత్రివేళల్లో డైనమిక్ బీట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాలనియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ శనివారం అధికారులను ఆదేశించారు.

April 19, 2026 / 06:16 AM IST

హైకోర్టు న్యాయమూర్తులను కలిసిన జిల్లా ఎస్పీ

NDL: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి. కృష్ణ మోహన్, జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఎ. హరి హరనాథ శర్మ శనివారం నందికొట్కూరులో అదనపు JFCM కోర్టు ప్రారంభ కార్యక్రమానికి విచ్చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.

April 19, 2026 / 06:15 AM IST

దొంగ హల్‌చల్.. దొరికిన కీలక ఆధారాలు

కాకినాడలోని సౌజన్యనగర్‌లో శనివారం రాత్రి 10:30 సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు గమనించగానే ఆ వ్యక్తి గోడ దూకి అక్కడి నుంచి పారిపోయాడని సమాచారం. సంఘటన స్థలంలో ఆ వ్యక్తికి చెందిన టూవీలర్ స్కూటీ, మొబైల్ ఫోన్ లభించాయి. కాల్ సెంటర్‌కు సమాచారం ఇవ్వగానే వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

April 19, 2026 / 06:12 AM IST

చందనోత్సవానికి రెండు లక్షల మంది వస్తారని అంచనా

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఉత్సవం రోజున తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. భక్తులు తమ సొంత వాహనాలను ఫుట్ హిల్స్ పార్కింగ్‌లో ఉంచి, ఉచిత ప్రత్యేక బస్సుల్లో కొండపైకి రావాలని కలెక్టర్ కోరారు.

April 19, 2026 / 06:12 AM IST

గోపవరం రైతులకు విద్యుత్ శాఖ అలర్ట్

కడప: బద్వేల్, గోపవరం మండలంలో వ్యవసాయ మోటార్లకు నేడు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే కరెంట్ ఉంటుంది. రైతులు ఈ సమయంలోనే నీరు పెట్టుకోవాలని ఈ ఈ కులాయప్ప, ఏఈఈ శివకుమార్ తెలిపారు. రైతులు ఈ సమయాన్ని గమనించి పంటలకు నీటి సరఫరా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. ఈ మార్పు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు.

April 19, 2026 / 06:11 AM IST

వరసిద్ధుని సేవలో AP ఆర్టీఐ కమిషనర్

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ (RTI) చావలి సునీల్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం చిత్రపటాన్ని ఆలయ ఏఈవో రవీంద్రబాబు అందజేశారు.

April 19, 2026 / 06:09 AM IST

వీడియో కాల్‌తో అరెస్ట్ అసాధ్యం: SP

ప్రకాశం: జిల్లా SP హర్షవర్ధన్ రాజు ప్రజలకు శనివారం కీలక సూచనలు జారీ చేశారు. వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. కొంతమంది మోసగాళ్లు పోలీసుల వేషంలో వీడియో కాల్స్ చేసి భయపెట్టి డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. ఇలాంటి కాల్స్‌ను నమ్మకూడదని, వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని హెచ్చరించారు. అనుమానం ఉంటే వెంటనే 1930కి కాల్ చేయాలని వెల్లడించారు.

April 19, 2026 / 06:05 AM IST