• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘భావితరాల కోసం నీటి సంరక్షణకు కృషి చేయాలి’

VZM : బావి తరాల కోసం నీటి సంరక్షణకు ఇప్పటినుంచే కృషి చేయాలని డీఎల్పివో శిరీష గంట్యాడ ఎంపీడీవో రమణమూర్తిలు కోరారు. శనివారం గంట్యాడ మండలంలోని రామవరంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని చెరువుల వద్ద అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. నీటి సంరక్షణకు కొత్త అడుగు అన్నారు.

April 18, 2026 / 07:42 PM IST

గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవు: ASP

KDP: ప్రొద్దుటూరు పరిధిలోని గ్రామాల్లో అల్లర్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ASP విభుకృష్ణ హెచ్చరించారు. శనివారం ప్రొద్దుటూరులోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిపై నమోదైన కేసుల వివరాలను పరిశీలించారు. రానున్న పంచాయితీ ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో ప్రశాంత వాతావరణ నెలకొల్పడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

April 18, 2026 / 07:31 PM IST

కోర్టు కేసులపై దృష్టి పెట్టండి: ఎస్పీ

GNTR: కోర్టు కేసుల పురోగతిపై దృష్టి సారించాలని గుంటూరు ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. శనివారం కోర్టు కానిస్టేబుళ్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఛార్జిషీట్లు దాఖలు చేయాలన్నారు. సాక్షులకు బెదిరింపులుంటే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పెండింగ్ వారెంట్లు, సమన్ల అమలు పక్కాగా ఉండాలి. కేసుల సత్వర పరిష్కారానికి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

April 18, 2026 / 07:30 PM IST

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరణ

ప్రకాశం: పెద్దారవీడు మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన సైదుబాబు ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సైదు బాబు బాధ్యతలు స్వీకరించారు. గత 18 నెలలుగా మార్కాపురం పట్టణ SIగా సైదు బాబు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ప్రజలు కొనియాడారు. అనంతరం సైదులు బాబు మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెడతానని అసాంఘిక కార్యక్రమాలకు చరమగీతం పాడుతానన్నారు.

April 18, 2026 / 07:30 PM IST

భూగర్భ జలాల కోసం ఇంకుడు గుంతలు: కమిషనర్

NTR: నందిగామలో “జలధార జలహారతి” కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు నిర్వహించారు. “స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర” కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. భూగర్భ జలాల పెంపుకోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. వర్షపు నీటి నిల్వ, నీటి వృథా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. అధికారులు, సిబ్బంది SASA ప్రతిజ్ఞ చేశారు.

April 18, 2026 / 07:30 PM IST

మహిళా సాధికారతకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట నియోజకవర్గంలో గ్రామ సమాఖ్య సహాయకులు (VOAలు)కు 113 ఉచిత 5G ఆండ్రాయిడ్ ఫోన్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గ్రామ స్థాయిలో పనిచేసే VOAలకు సాంకేతిక సహకారం అందించడం ద్వారా పనితీరు మరింత వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.

April 18, 2026 / 07:30 PM IST

‘శిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలను పరిష్కరించాలి’

ASR: మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ అధికారులను ఆదేశించారు. శనివారం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పటల్‌లో సమస్యలను తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణీలతో ముచ్చటించారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. విద్యుత్తు, ప్లంబింగ్, నీటి సమస్యలు ఉన్నాయని తనిఖీల్లో గుర్తించారు.

April 18, 2026 / 07:29 PM IST

ఏయూ ఛాయాచిత్ర ప్రదర్శనకు విశేష స్పందన

VSP: ఏయూ జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాయాచిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. శతాబ్ధి చరిత్రను ప్రతిబింబించే ఫోటోలతో విశ్వవిద్యాలయ వికాసం, క్యాంపస్ అందాలను విద్యార్థులు కళాత్మకంగా ప్రదర్శించారు. టి.ఎల్‌.ఎన్ సభామందిరంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను నగర విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తిలకించారు. కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.

April 18, 2026 / 07:26 PM IST

పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై పగడాల రమణ ధ్వజం

CTR: పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయంలో సింగల్ విండో ఛైర్మన్ పగడాల రమణ మీడియా సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్షాలు అడ్డుకోవడం అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. మహిళా సాధికారతకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మహిళలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని రమణ హెచ్చరించారు.

April 18, 2026 / 07:26 PM IST

వైద్యం కోసం పేదలకు అండగా ఎమ్మెల్యే

VZM: ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్పష్టం చేశారు. శనివారం ఎస్.కోట క్యాంపు కార్యాలయంలో ఆలుగుబిల్లి గ్రామానికి చెందిన రాయవరపు మాలిని అనే మహిళకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 2.5 లక్షల విలువైన ఎల్.వో.సీ పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు.

April 18, 2026 / 07:21 PM IST

‘ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి’

SKLM: ఇచ్చాపురంలోని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం పర్యటించారు. ఈ మేరకు ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీసులో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇచ్చాపురం జనసేన ఇంఛార్జ్ దాసరి రాజు ఇచ్చాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని,పైడిగం ప్రాజెక్ట్ మరమ్మతులకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

April 18, 2026 / 07:16 PM IST

మెగా కోలాటం కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

పార్వతీపురంలో ఏప్రిల్ 22వ తేదీన 6వేల మంది విద్యార్థులతో 18 నిమిషాలపాటు చారిత్రాత్మకంగా లిమ్కాబుక్ ఆఫ్ రికార్డులలో స్థానం పొందేలా కోటాటం నృత్యం ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను తప్పక హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ఆహ్వానించారు. ఈసందర్బంగా ఇంతటి బృహత్తర కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

April 18, 2026 / 07:15 PM IST

ఘనంగా ఏయూ శతాబ్ది ఉత్సవాలు

VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ధి ఉత్సవాల ప్రధాన కార్యక్రమానికి ఈ నెల 27న ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా, భారతరత్న సచిన్ టెండూల్కర్ విశిష్ట అతిథిగా హాజరవుతారని వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సుమారు 25 వేల మంది విద్యార్థుల సమక్షంలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

April 18, 2026 / 07:12 PM IST

మహిళా జూనియర్ కళాశాల అధ్యాపకుల ప్రచారం

AKP: నర్సీపట్నం ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాల అధ్యాపక సిబ్బంది కాలేజీలో నూతన అడ్మిషన్ క్యాంపెయిన్ ప్రారంభించారు. శనివారం మున్సిపాలిటీ బీసీ కాలనీలో నూతన విద్యార్థినీలకు అడ్మిషన్లపై అవగాహన కల్పించారు. తమ కళాశాలలో సాధించిన ఉత్తీర్ణత శాతం వివరించారు. కాలేజీలో ఉన్న సౌకర్యాలను పేర్కొంటూ కళాశాలలో చేరాలని ప్రచారం నిర్వహించారు.

April 18, 2026 / 07:12 PM IST

‘బిఎల్ఏలను త్వ‌ర‌గా నియ‌మించాలి’

VZM: రాజ‌కీయ పార్టీలు ప్ర‌తీ పోలింగ్ కేంద్రానికి త‌మ ప్ర‌తినిధులుగా బిఎల్ఏల‌ను నియ‌మించి, ఆ జాబితాను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ స‌త్తిబాబు కోరారు. వివిధ రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో శనివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. బిఎల్ఎల‌ను నియ‌మించుకోవ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర&zwnj...

April 18, 2026 / 07:07 PM IST